ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20]

పదియవ ప్రకరణము

153


బోయియున్న సమయమున మెడారిజాతివారు తిరుగుబాటు నొనర్చిరి. బాలుం డయ్యును అలకసుందరుఁడు వారిపై నెత్తి పోయి వారిం బరాజితులఁజేసి తనపేర నొక పట్టణమును గట్టించెను. తరువాత తండ్రి తోడం గూడ యుద్ధభూమికి వెడలి కెరొనియా యుద్దమని పేరుగాంచిన సమరమున ముఖ్యుఁడై పనిచేసెను. ఫిలిపు కుమారుని మిక్కిలి గౌరవముతోఁ జూచుచువచ్చెను.

అయిన నియ్యది బహుకాలము నడచినదిగాదు. వయసు చెల్లినవాఁడే యయినను ఫిలిపు మోహావేశముచే రెండవ భార్యను బెండ్లియాడెను. దానివలన గృహకల్లోలములు కలిగి అలకసుందరుఁడు దేశత్యాగియయి తలదాచుకొనవలసి వచ్చెను. ఒక స్నేహితుని మధ్యవర్తిత్వముస నతఁడు మరల తండ్రికడ స్నేహభావముతో వచ్చి చేరెను. పిదపఁ గొంత కాలమునకు నన్యాయము ననుభవించి క్రుద్దుండయిన పౌరుడొక్కఁడు ఫిలుపును దుదముట్టించెను. అలకసుందరుఁడు సింహాసనము సధిష్టించె. ( క్రీ. పూ. 335) వెన్వెంటన ఫిలిపు సామ్రాజ్యమున నెల్లెడల తిరుగుబాటులు దలసూపి రాజ్యవిచ్చేద మగునట్లు గాన్పించెను. గ్రీకు పట్టణములగు ధీబ్సు ఆథెన్సులు యుద్ధమునకు సమకట్టెను. అలకసుందరుఁ డందఱ సాహసమున నెదిర్చి పరాజితులఁ గావించెను. గ్రీకుపట్టణ రాజ్యములెల్లయు నితనిని తమ నాయక శిఖామణిగ నెన్నుకొని అప్పుడు దమకును పారసీక ప్రభువగు డెరయసునకును నడచుచుండిన విగ్రహమువ కీతనిని నియమించిరి. రమారమి యీ కాలప్రాంతమున నొక