ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

చంద్రగుప్త చక్రవర్తి

రాక్షసము : యుద్ధమునందు కన్యయొక్క బంధువుల నోడించి కన్య నెత్తుకొని పోవుటకు రాక్షసమని పేరు. 1[1] రుక్మిణీ కృష్ణుల వివాహ మీ తెఱంగుది. పూర్వము ఈ విధమగు వివాహములయందు కన్యాపురుషులకుఁ బరస్పరానురాగము విస్పష్టముగఁ గానఁబడుచున్నది. అది యుండినను గాంధర్వ వివాహముతో నిదియును సామ్యముకలదియే కాన దీనను భ్రమాదుల కాస్పదంబుగలదు. ఒక వేళ నిందు కన్యక కనురాగము లేకుండుటయుఁ దటస్థింపవచ్చును. అప్పుడిది గాంధర్వంబున కంటె దూష్యంబయ్యెడు. కావున నిద్దానికిం గూడ విమోచనస్మృతి.

పైశాచము : ఇది వివాహములయం దధమము. కన్య కిష్టములేకయే ఆమె నిదురించుచుండఁగనో మైమఱచి యుండఁగనో మనోవికలత్వమంది యుండఁగనో ఆమెపైబడి వరుఁడు ఆమెను లోఁబఱచుకొనుట పైశాచ మనంబరగు. ఇద్దానిని వివాహవిధులలో మన ధర్మకర్త లేల చేర్చిరో తెలియ రాకున్నది. 2[2] ఈ బంధమునకు విమోచన మవసర మని వేరుగ వ్రాయవలెనా ! వట్టి విమోచన మొక్కటియెగాక కామాంధకార సంజనితదు శ్చేష్టాలంకృతుండయి ఈ విధమగు వివాహంబు నాశించువరునకు నుచితంబగుఁ గఠిన శిక్షాస్మృతియుం

  1. 1. రాక్షసోయుధ్ధహరణాత్ : యాజ్ఞవల్క్య 1-61, మనుస్మృతి 3-33
  2. 2. మస్తాం మత్తాం ప్రమత్తాం హరహోయత్రోపగచ్చితి వపాపిష్ణోవివాహానాం పైశాచశ్చాష్ట మో ఆధమః మనుస్మృతి 1-34