ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

135


నసహ్యత నా దేశంబగుట సర్వజనవిదితము. అట్టి సందర్భముల బంధవిమోచనమునకు మార్గము లేకపోయిన ననర్థములు వాటిల్లును గదా!

ఆసురము:1[1] ఈ తెగ పెండిండ్లు నేఁటికిని మనదేశమునఁ గానవచ్చుచు మన సంఘాభివృద్ధికి వేరుపురువులై పరిణమించు చున్నవి. ధనాశాపిశాచము పీడింపఁ గన్యాశుల్కము పుచ్చుకొని తలిదండ్రులు మాంసవిక్రయ మనియైన వెనుదీయక తాము గడుపార కన్న బిడ్డలను అమ్మివేయుటను మన ధర్మకర్తలు ఒక విధమగు వివాహముగ వర్ణింపక తప్పనందుల కెంతయుఁ జింతిల్లవలసి యున్నది. అయిన వారిడిన పేరు మాత్రము ఈ వినాహముల నెంతవఱకు ఖండింపవలెనో యంతవఱకును ఖండించుచున్నది. ఇట్లు దుష్టమగు వివాహంబు గావున దీనికి విమోచనం బవసరమని వేరుగఁ జెప్పఁబనిలేదు. కులగోత్రములను స్థితిగతులను రూపారూపంబులను ఆరోగ్యా నారోగ్యంబులను యౌవన వృద్దాప్యంబులను యోగ్యతా యోగ్యతలను విచారింపక భర్తను గట్టిపెట్టిన నాతఁడు దుర్మార్గుఁడో షండుఁడో యైన భార్య యేమిచేయవలయును? అతనిం బరిత్యజింప వలసినదేగదా! ఈ కన్యాశుల్కాచారపు దుష్ఫలంబులను మాన్పుటకు నిప్పుడు మనదేశంబుస దాంపత్య విమోచన స్మృతియొండు చంద్రగుప్తుని కాలంబునందువలెఁ గల్పించిన శ్రేయోదాయకం బగునని తోఁచెడిని.

  1. 1. అసురో ద్రవిణాదానాత్ యాజ్ఞవల్క్య 1-81, మనుస్మృతి 3 - 33