ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

చంద్రగుప్త చక్రవర్తి


రాజు

ఇప్పగిది సర్వవిధములఁ బ్రజల సంరక్షయే ప్రథమ కర్తవ్యముగఁ జేయుచుండిన చంద్రగుప్తుని దినచర్యను గొంచెముగ నిట వర్ణింపవలసి యున్నది.

దినము ఎనిమిది భాగములుగను రాత్రి యెనిమిది భాగములుగను విభజింపఁబడి యుండెను. ఈ భాగములకు నాళికలని పేరు. దివసపు మొదటినాళిక రక్షకుల నేమించుట యందును లెక్కలఁ బరిశీలించుటయందును రాజు గడపు చుండును. తరువాత నొక్క నాళికకాలము అనఁగా రమారమి ఇప్పటి 7-30 మొదలు 9 గంటల వఱకును ప్రజల మేలుకీడుల నరయుట యతనిపని. పిదప నాళికకాలము అతని భోజనాదులకును జదువునకును వినియోగింపఁబడుచుండె. నాల్గవ నాళికయం దతఁడు కరాది హిరణ్యంబును గ్రహించుట యందును అధ్యక్షుల నియమించుట యందును వెచ్చించును. ఐదవనాళిక మంత్రివర్గముతో జరుగవలసిన ఉత్తర ప్రత్యుత్తరముల కేర్పడి యుండెను. ఆఱవనాళిక యాటపాటలకును వినోదములకును నియమితము, ఏడవ నాళికయందు నేనుఁగులను, గుఱ్ఱములను, రథములను, కాల్బలములను రాజు పరీక్షించును. ఎనిమిదన నాళిక యుద్ధవిషయంబుల సేనాధ్యక్షునితోఁ బర్యాలోచించుట యందు గతించును. రాత్రియందలి ప్రథమనాళిక వేగులవారి వార్తలకును, రెండవది స్నానాదులకును, మూఁడవది మృదంగాదికముల సుస్వనములచే నిద్రనందుటకును, నాల్గవ ఐదవ నాళికలు నిద్రకును, ఆఱవది మంగళారావములకు మేల్కాంచి ధర్మముల మననము చేయుటకును, ఏడవది రాజ్య కార్యపద్ధతుల నిర్ణయించుకొని చారుల నియోగించుటకును,