ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

119

చంద్రగుప్తుని కాలపుఁ జట్టములు పరిపూర్ణత్వమున నప్పటి చట్టములకుఁ దీసిపోవుటలేదు. భార్య మూర్ఖురాలయి నప్పుడు భర్త ఆమె నెంతవఱకుఁ బారుష్యముతోఁ జూడ వచ్చునో చెప్పి ఆమెను వెదురుబద్దతో నైనను త్రాటితో నైనను దన యఱచేత నైనను పురుషుఁడు మూఁడు దెబ్బల కంటె నెక్కుడు కొట్టినచో నేరస్థుఁడగునని వ్రాయఁబడి యున్నది. దీనినిబట్టి మా సిద్ధాంతము నిశ్చయమనుట తెల్లము కావున విశేషమిట వ్రాయుట యనవసరము.

ఈతిబాధలు, వాని నివారణము

అతివృష్టి రనావృష్టిః శలభామూషకాః శుకాః
ప్రత్యా సన్నాశ్చ రాజానః షడేతా ఈతయః స్మృతాః||

అని ఈతిబాధలు వర్ణింపఁబడినవి. వీనినుండి ప్రజలను సంరక్షించి పరిపాలించినవాఁడె ధర్మము నెరవేర్చిన రాజని మన శాస్త్రకారుల మతము. మిడుతలు, ఎలుకలు, చిలుకలు మున్నగునవి వేఁటలవలనను మందులవలనను ప్రాంతిక రాజులు యుద్దమువలనను నివారింపఁబడుదురు. చంద్రగుప్తుఁడీ రెండు సాధనములును సంపూర్ణముగఁ గలవాఁడని అతని చరిత్ర మొదటినుండి చదివినవారందఱకు విదితంబె. అక్కాలమున గృహములు సర్వసాధారణముగఁ గలపచేఁ గట్టఁబడుచుండి నందున నతివృష్టి, బాధయందొక యంశమునకుఁ బ్రతీకారము గానవచ్చు చున్నది. కాని యతివృష్టివలనను ననావృష్టివలనను గలుగు గొప్పబాధలు క్షామములును . తత్ఫలంబుగ, జాడ్యము