ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

చంద్రగుప్త చక్రవర్తి


మనుష్యపథములనియు, అసంపథములనియు, వరుసగ రాజులు, రథములు, పశువులు, ఖరోష్ట్రములు, శకటములు, సాధారణ ప్రయాణీకులు, బరువు మోసికొని పోవువారును ఉపయోగించు కొనుట వలన వచ్చిన పేళ్లు. రాష్ట్ర పధములనియు, వివీత పథములనియు, ద్రోణుముఖ పథములనియు, స్థానీయ షథములనియు, సయోనీయపథములనియు, వ్యూహపధములనియు, శ్మశానపథములనియు, గ్రామపథములనియు, వనపథములనియు హస్తిక్షేత్రషథములనియు, సేతుపథములనియు, నాయాగమ్య స్థానములనుబట్టి వచ్చిన నామధేయములు.

ఇవిగాక కోటలయందు విశేషమార్గము లుండెడివి. వాని నిటఁ బేర్కొనఁ బని లేదు.

ఈ బాటలెల్లయును బహుజాగరూకతతో గాపాడఁ బడుచుండెను. వీనిపై ప్రయాణీకుల కభ్యంతరము గలుగఁ జేసిన వారు దండింపఁ బడుచుందురు. ఇందు దక్షిణదేశమునకుఁ బోవుచుండిన బాటలవలన వజ్రములు, ముత్యములు, రత్నములు, బంగారు, శంఖములు మున్నగు వస్తువుల వ్యాపారము మిక్కుటముగ జరుగుచుండి నందున నా మార్గములకే చాణక్యుఁడు ప్రాముఖ్యత నిచ్చియున్నాఁడు. అన్ని మార్గముల మూలమునను జక్కని వ్యాపారము జరుగుచుండె ననుటకు సందియము లేదు. ఇంతియగాక ఈ మార్గము లింకొకవిథమునఁ గూడ నుపయోగించు కొనఁబడుచుండెను. అతివిస్తారంబగు నా రాజ్యమున సమయోచితంబుగ దండులను మందుగుండు