ఈ పుట అచ్చుదిద్దబడ్డది
106
చంద్రగుప్త చక్రవర్తి
నాణెముల పేళ్లు. | అందలి విశేష లోహములు | వెల (గురిగింజలలో) |
1 పణము | 1/16 రాగి, 1/16 సీసము | =80 గింజలు = 80/122 తులములు = ఇంచుమించుగ నిప్పటిరూపాయిలో 2/3 వంతు |
2 అర్థపణము | " | = 40 గింజలు, |
3 పాదము | " | = 20 గింజలు, |
4 అష్టభాగము | " | = 10 గింజలు |
1 మాషము | 1/4 వంతు ఇతరలోహం | = 5 గింజలు |
2 అర్ధమాషము | " | 2 1/2 గింజలు, |
కాకణి | " | 1 1/4 గింజలు |
అర్ధకాకణి | " | 5/8 గింజలు |
పై వివరణపట్టికయందుఁ గనినవిగాక అర్ధశాస్త్రమునందు చాణక్యుఁడు బంగారు నాణెములను బేర్కొని యున్నాఁడు. 5 గింజలయెత్తుగలది మాషమనియు, 16 మాషముల యెత్తుది సువర్ణములేక కర్షకమనియు, నాలుగు కర్షముల యెత్తుదీ యొక పలమనియు వాడియున్నాఁడు. ఈ పరిమాణ పరంపర తూనిక మాత్రమునకయి యుండనోపునా ? తూనిక మాత్రమునకు సువర్ణపు దిమ్మెలు గావలెనా? చంద్రగుప్తుని కాలమున నియ్యవి వాడుకలో నుండిన బంగారునాణెములని చెప్పుటయే యుక్తీ యుక్తముగ నున్నది. అప్పటికాలమున హిందూదేశము బంగారమునకుఁ బేరువడసి యుండెను.