ఈ పుట ఆమోదించబడ్డది

"అయితే మీకుమార్తెను నాకిచ్చి పెళ్ళిచెయ్యండి," అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి మూడుకాళ్లముసలి. అందులో పగలుచూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అలాంటివాడికి చూస్తూచూస్తూ, చక్కనిచుక్క, పదహారేళ్లబాలను ఎలా ఇవ్వటం? నవాబు ఆలోచించ సాగాడు.

నవాబుకొడుకు ఫిరోజిషా అన్నాడు:- "నీవు గారడీచేశావో లేక, ఆ గుర్రానికే ఆశక్తివుందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో, నిజం తేల్చుకోకుండా ఎలాతీసుకోవటం? నేను పరీక్షిస్తా." అని,

ఫిరోజిషా ఎకాయెకివెళ్ళిని కీలుగుర్రమెక్కి మీటనొక్కాడు. అది రివ్వునలేచి, చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది. నవాబు, అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేరు. ఫిరీజిషా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ కూచున్నారు. మధ్యాహ్నమైంది. ఆచూకిలేదు. సాయంత్రమైంది, అయిపులేదు, ప్రొద్దుగూకింది. ఆనవాలు లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తనకొడుకు యిలా అయ్యేవాడు కాదుగా. "వీణ్ణి తీసి కెళ్ళి జైలులో పడెయ్యండి, తరువాత చూదాము," అన్నాడు. నవాబు శిల్పిని తీసికెళ్ళి భటులు జైల్లో తోశారు.

ఇక ఫిరోజిషా ఆ కీలుగుర్రంమీద వాయువేగంతో పైకిలేచాడు. ఆవేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానోనని క్రిందికి చూచాడు, మనుషులు కనిపించలా. చెట్లు కనిపించలా. తనకోట కనిపించలా. చందనగిరి