ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

                       చలిజ్వర నిదానము
    చలిజ్వర నిదానమనగా చలిజ్వరమును గుర్చించు విధము.

ఈదేశములోని కొన్నివైద్యశాలలలోవైధ్యులు దినదినమ్ను వందలకొలది

కొన్నివైద్య శాలలలో
చేయబడువైద్యము..

రోగులను చూదవలసివచ్చును. అట్టిసమయములలో త్వరగా పని ముగించుకొనుటయే ముఖ్యమగుటచేత రోగికి సరియైన వైద్యము జరుగు చున్నదో లేదో విచారించుటకు వీలులేదు. ఒకవేళ నొకానొకవైద్యుడు శ్రద్ధచేసి వ్యాధులను గ్రహించిన తరువాతనే వైద్యము చేసెదనని ప్రతిజ్ఞబట్టి పనిచేసినను అట్టి వానికి కావలసిన సూక్ష్మదర్శనులు మొదలగు సాధన సామగ్రియంతయును సామాన్యముగా వైద్యశాలలో నుండదు. అందుచేత తనవద్దకు రోగి వచ్చినతోడనే వైధ్యుడు రోగికి అప్పటికప్పుడు ఏదో ఒక మందు ఈయవలసి వచ్చును.