ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము

65

చతుర్ధకజ్వరములు::-

4 మరికొన్ని జ్వరములు నాలవ పటములో చూపిన ప్రకారము 72 గంటల కొకసారి అనగా జ్వరము కలిగిన దినము మొదలు నాలుగవ నాడు మరల వ్యాపించును. వీనికి చతుర్ధక జ్వరము అని పేరు.

మలేరియా పురుగుల జాతులు నాలుగు:-

పైన ఉదాహరించిన నాలుగు జాతులు మలేరియా జ్వరములకును నాలుగు జాతుల మలేరియా పురుగులు గలవు. ఒక జాతి పురుగువలన ఆజాతి జ్వరమే వచ్చునుగాని వేరొక జాతిజ్వరము రాదు. ద్వితీయకజ్వరపు పురుగులవలన దినదినం వచ్చెడి జ్వరము వచ్చునుగాని దినమువిడిచి దినమువచ్చు జ్వరము రాదు. ఇట్లే సామాన్య మలేరియా జ్వరపు పురుగు వలన విష మలేరియా జ్వరము రాదు. విషజ్వరపు పురుగులవలన సామాన్య జ్వరము రాదు.

ఒకదినముననే రెండుసార్లు జ్వరము వచ్చుట:-

అయినను ద్వితీయక జ్వరమును గలిగించు పురుగులు కొన్ని యొక నాడేదోయొక సమయమునందును, మరికొన్ని ఆదినముననే మరియొక సమయమునందును రోగియొక్క రక్తములొ ప్రవేశించినయెడల మొదట ప్రవేశించిన జ్వరపు పురుగులవలన గలిగిన జ్వరము దినమునకు ఒకసారివచ్చును. ఈపురుగులవలన కలిగిన జ్వరమువచ్చిదిగిపో