ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

చ లి జ్వ ర ము


పడు తుక్కలేనప్పుడే నీటియందైనను దొమపిల్లలు వృద్ధి పొందకుండ చేయువచ్చును., అయినను మురిగి పోయిన నీటిలో వానికి చాలినంత ప్రాణవాయువు లేకపోవుటచేత చేపలుబ్రతుకజాలవను విషయమును గమనింపవలెను.

గాలికూడ నీటి యుపరితలమునకు దొరకుండునట్లు నీటిమీద నాచుమిక్కిలి దట్టముగ అల్లుకొని యున్నయెడల అట్టినీటిలో దోమపిల్లలు పెరిగినను తరువాత గాలిలేక యవి యుక్కిరి బిక్కిరి అయి చచ్చును.

దోమలనశిం
పుజేయుఇతర
సాధనములు

ఉప్పుసున్నము, మైలతుత్తము, అన్నభేది మొదలగు పదార్దములను నీళ్ళలో కలిసి నప్పుడా నీరు దోమపిల్లలను నాశనంచేయును. కాని అవి సామాన్యముగా నన్నిచోట్ల నుపయోగకరములు కావు.కిర్సనాయిలును నీటి మీద వేసినతోడనే యది మిక్కిలి పలుచనిపొరగా నీటిమీద ప్రాకిపోవును.ఇట్లు నీటియుపరితలము నంతను ఆక్రమించిన ఈకిర్సనాయిల్ పొరగుండ గాలిచొరదు. అందుచే నీటిలోని దోమపిల్లలన్నియు పీల్చుటకు గాలిలేక చచ్చిపోవును. అయినను గాలి