ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

59


వ్రేలాడవేసిన బట్టల చాటునగాని, దాగికొని యుండును.

ii ఆడ అనాఫలీసు దొమలు నెత్తురు మాత్రము త్రాగి బ్రతుకును.

iii. అనాఫలీసు దోమ లధికముగ వృద్ధి చెందు కాలము ఆయా దేశములయందలి వర్షఋతువును బట్టియు ఆయా యుపజాతియొక్క నివాసస్థానములను బట్టియు మారుచుండును.

iv. అనాఫలీసు దోమలు చాల దూరము పరుగెత్తవు.

v. కొన్నిచోట్ల అనాఫలీసు దోమలు చలికాలము రాగానే ఎక్కడ వేడిగ నుండునో ఆ దేశమునకు పోయి తిరిగి తగినకాలము వచ్చినపుడు తమ నివాసస్థానమునకు వచ్చును. దోమలు చలికాలము రాగానే యొక్కటియు కనబడక పొవుటకును, తిరిగి వేసవికాలములో వేనవేలు ఉత్పత్తియగుటకును కారణము లూహింపనగును.

vi. కొన్ని దోమలు వానివృద్ధికితగని స్థితిగతులు వచ్చినప్పుడు తాము దాగియుండుటకు తగియుండు నెల కొట్లు మొదలగు చీకటి గగులలోనికిపోయి