ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ లి జ్వ ర ము

52



దోమల గ్రుడ్లు

ముగా అనాఫలీమదోమలు నీటిపైని తేలుచుండు నేదేని యొక ఆకు, పుల్ల మొదలగు తుక్కుమీద కూర్చుండి నీటిలోనికి తమగ్రుడ్లను విడుచును. ఇవి నీటిమీద పడిన వెంటనే విడిపోయి నీటిపైని నల్లని నలకలవలె తేలుచుండును.

క్యూలక్సుదొమలు ఈ క్రింది 17-వ పటములో చూపబదినట్లు తమగ్రుడ్లను దొప్పవలెనుండు నొక


17-వ పటము

ముద్దగాపెట్టును. ఈదొప్పలో ననేక వందల గ్రుడ్లు ఒక దానిప్రక్క నొకటి యంటుకొని యుండును. ఇట్లు తేలునప్పు డీదొప్ప చూచుటకు కిరసనాయిల్ మసియుండ నీటిలో తేలుచున్నట్లుండును.

దోమలు నీటిపురుగులు.

రెండుమూడు దినములలో ఈగ్రుడ్లుపెరిగి చిన్న చిన్నపురుగులవలెనయి నీటియం దతివేగమున నీదుచు ఆతురతతొ మురికిని తినుచు మునుగుచు తేలుచు మెలికలు తిరుగుచు పరుగులెత్తు చుండును.