ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

చ లి జ్వ ర ము


రక్తములో మలేరియా పురుగులు లేవరన్ కనిపెట్టెను

ఈ సంవత్సరమున లేవరన్ (Laweran) అను ఫ్రెంచి వైద్యుడు ఈ వ్యాధిగలరోగుల నెత్తుటితో క్రింద 8-వ పటములో జూపబదినట్లు చంద్రవంకవలె ప్రత్యేక ఆకారముగల యొక పురుగును కనిపెట్టెను. పిమ్మట ఈ పురుగు కదులుచుండుటయు, కొన్ని మార్పులను చెందుటయు కూడ నితడు కనిపెట్టెను. చలి జ్వరముల యొక్క ఉత్పత్తిని కనుగొనిన మహానుభావులలో నీతడే మొదటివాడు. ఈతని కీర్తి శాశ్వతముగ నుండును. ఇతడిది కనిపెట్టినను చిరకాలమువరకు ప్రజలు దాని యుపయోగమును కనుగొన లేకపొయిరి. ఇటలీ దేశపు వైద్య సంఘమువారు తాము బురదనుండి తీసిన ఒకానొక విధమైన సూక్ష్మజీవియే ఈ చలిజ్వరమునకు కారణమని వాదించుటచే లెవరన్ యొక్క వాదము మూలబడెను.

దోమలకు మలేరియాకు సంబంధమున్నదని మేన్ స్సన్ కనిపెట్టెను

1894-వ సంవత్సరములొ మేన్ సన్ (Manson) అను నాతడు చలిజ్వరములు వచ్చు స్థలములును, దొమలుందు స్థలములును, ఒకటియేయని కనిపెట్టి అందుదేత దోమలకును, చలిజ్వరములకును ఏదొ ఒకవిధమైన సంబంధముండవలెనని ఊహచేసెను. ఇదిగాక మానవుల నెత్తురును వెలుపలికి తీసినప్పుడే