ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

చ లి జ్వ ర ము


తా॥ శుక్రస్థానమును పొందిన జ్వరమునందు మేధ్రము స్తంభించి యుండును. శుక్రం బధికమగా స్రవించును. రసాదిధాతువులలో శుక్రగత జ్వరము నందు మనుజుడు మృతుండగును.

రసాది ధాతుగత జ్వరములలో సధ్యాసాధ్య నిర్ణయము.

శ్లో॥ రసక్తశ్శీతస్సాధ్యోమాంసమేదో గతశ్చయ॥
     అస్థిమజ్జగత:కృచ్చశుక్రస్థస్తునసిధ్యతి॥

 తా॥ మున్ను చెప్పిన రసదిగత జ్వరములలో రస రక్త మాంసమేదోగత జ్వరములు సాధ్యం బులై యుండును. అస్థిమజ్జలనాశ్రయించిన జ్వరములు కష్ట  సాధ్యములై యుండును. శుక్రగతమైన జ్వరము సాధ్యంబుగాదు.

శ్లో॥ బలవత్సల్పదోషేము
     జ్వరస్సాధ్యో నుపద్రవ॥

సాధ్య జ్వర లక్షణము

తా॥ మిక్కిలి బలవంతులైన మనుజులకు స్వల్పంబులైన వాతాది దోషములచే జనించిన జ్వరము కసాద్యున ద్రవములు లేకున్నయెడ అట్టి జ్వరము సాధ్యంబై యుండును. జ్వరోపద్రవములు గ్రంధాంతమునం దీరీతిననున్నయవి:--