ఈ పుట ఆమోదించబడ్డది

20

చలిజ్వరము


మలేరియా:—ఈపదమునకు ఇంగ్లీషుభాషలో చెడుగాలి అని వ్యుత్పత్త్వర్ధము. ఈజ్వరము బురద గుంటలు మొదలగు వానినుండివచ్చు చెడుగాలిని పీల్చుటవలన కలుగుచున్నదని ఆంగ్లేయులు కొంతకాలముక్రిందట నమ్మియుండిరి. అందువలన దీనికి మలేరియా అని పేరుపెట్టిరి. కాని క్రింద మీరు చదువబోవు ప్రకారము ఈజ్వరమునకు ముఖ్యకారణము దోమకాటని స్పష్టపడి యున్నందున మలేరియా అను పేరుగూడ నిరర్దకము.

దోమజ్వరము:—కొందరు దీనికి దోమజ్వర మని పేరుపెట్టిన బాగుగనుండునని తలచిరి.

కాని చలిజ్వరమన్నపేరు అనేక ప్రదేశములలో తరుచుగ వాడుకలోనున్నందునను, సాధారణముగా ఈజ్వరమునకు ముఖ్యచిహ్నములు చలియు జ్వరమును అయి యున్నందునను, చలిజ్వరమను పేరే వాడుచున్నాను.

శీతకాల జ్వరము:—శీతకాలమునందు అనగా నవంబరు, డిశంబరు, జనవరి నెలలలో ప్రబలి యుండుటచే ఈజ్వరమునకు శీతకాల (శీతకట్టు) జ్వరమనియు కొన్నిచోట్ల పేరుగలదు.