మొదటి ప్రకరణము
17
టకు ప్రారంభించి 17-వ తేది నాటికి 98 డిగ్రీలకు వచ్చియున్నది. మొదటి తేది మొదలు 17-వ తేదివరకు జ్వరము ఒక్కనాడైనను 98½-కు అనగా సామాన్య శరీరవేడిమికి దిగలేదు. ఈ జ్వరమునకు క్వయినా ఇచ్చుటవలన ప్రయోజనము కనబడలేదు.
1. పైన చెప్పబడిన రోగులకు ఆరు గురికి వచ్చిన జ్వరము వేరువేరు జాతిజ్వరములా లేక ఒకటే విధమైన జ్వరమా?
2. మొదటి ఇద్దరికిని క్వయినా ఇచ్చిన తోడనే జ్వరము నిలుచుటయేమి? 4-వ పటము లోని వానికి క్వయినా ఇచ్చుటచేత ఒకదినము జ్వరము విడిచి మరుసటిదినము జ్వరము విడువక పోవుటకు కారణమేమి?
3. పైన చెప్పబడిన జ్వరములు, క్రమముతప్పకుండ ఒకనికి దినదినమును, మరియొకనిని దినము విడిచి దినమును, ఇంకొకనికి 3 దినముల కొకసారియు వచ్చుటకును, 5-వ పటములోని వానికి ఏ విధమైన క్రమము లేకుండవచ్చుటకును ఏవైనను కారణము లున్నవా?
4. పైని 2, 3, 4, 5, 6 పటములలో జూపబడిన రోగులకు జ్వరము విడిచి విడిచి వచ్చుచుండెను.