ఈ పుట ఆమోదించబడ్డది

4

చలిజ్వరము


చెప్పిన "కాదు కాదు అమ్మవారు" అనును. ఒకకాలో చేయియో ఉపద్రవముగ వాచినప్పుడు నీ శరీరములో ఒకానొక విధమైన సూక్ష్మజీవులు ప్రవేశించి రక్తమును చెరుచుటచే నీకు కురుపు వేయుచున్నదని చెప్పిన "కాదు కాదు, మంత్రము" అనును; లేదా "మా పొరుగింటివాడు ప్రయోగము చేసెను" అని చెప్పును. అమిత మైన చలి కుదుపుచే వడకుచు ఇంటిలో నున్నదుప్పట్లు అన్నియు కప్పుకొను నొకరోగియొక్క శరీరమంతయు 15 నిమిషములలోపల తహతహ మండుచున్నట్లు చేయుమార్పు జ్వరలక్షణమనియు. ఈ జ్వరము దోమకాటు మూలమున మన నెత్తుటిలొ ప్రవేశించు నొకా నొక పురుగువలన కలుగుచున్నదనియు చెప్పిన యెడల "కాదు కాదు, దయ్యము" అనును. ఇట్టి నమ్మకము చదువెరుగని జనసామాన్యమునందే గాక బి.ఏ., ఎం.ఏ. పరీక్షలలో తేరినామని చెప్పుకొను జ్ఞానము దేశమంతటను వ్యాపించి యుండుటకు వైద్యులే కారకులని నానమ్మకము. ఒక వ్యాధిని గుర్తెరిగిన వైద్యునకు ఆ వ్యాధిని కుదిర్చి నంతమాత్రమున తన పని తీరలేదు. తన సాటి ప్రజలకు ఆ వ్యాధి