ఈ పుట ఆమోదించబడ్డది


చలిజ్వరము


ఇది వ్యాపించువిధము; దీనిని నివారించు పద్ధతులు; చికిత్స

మొదటి ప్రకరణము


జ్వరభేదములు

మన దేశమునందు అన్ని వ్యాధులలో సర్వ సామాన్యమైనవ్యాధి జ్వరము. జ్వరము
సామాన్యవ్యాధి.
గడచిన 10 సంవత్సరములలోపల ఏ సంవత్సరము యొక్క జనాభా లెక్కలు తీసిచూసినను ఈ దేశమునందు జ్వరము వలన మృతినొందిన జనులసంఖ్య తక్కిన వ్యాధులన్నిటిచే చచ్చినవారి మొత్తముకంటే అయిదారు రెట్లు హెచ్చుగా నున్నది.

క్రొత్తగా మన దేశమున బుట్టిన మహామారి వ్యాధివలన గడచిన 6 సంవత్సరములలో మన హిందూదేశమున అంతటను జేరి 15 లక్షల మంది చనిపోయినట్టు కనబడుచున్నది. జ్వరమువలన ఒక్కొక్క సంవత్సరమునందే 40 లక్షలు మొదలు 50 లక్షలవరకు చచ్చుచున్నారు. మహామారి