ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

చ లి జ్వ ర ము


{{left|దోమలుప్రవేశింపరాని ఇండ్లు: దోమతెరలు.

చేయబడిన తలుపులను సరిగా నమర్చుకొనవలెను.ప్రొద్దుగ్రుంకక ముందే యింటిలో నివసించు వారందరును ఇంటికి చేరిన వెంటనే తలుపులన్నిటిని మూసి దోమలింటిలో ప్రవేశింపకుండ చేసికొనవలెను. రాత్రులయం దెంతమాత్రము వెలుపలకు పొకూడదు. వసారాలో కూర్చొన కూడదు. ఇట్టివారిని దోమలు కుట్టలేవు. మిక్కుటముగ చలిజ్వరములుగల ప్రదేశములలో సహితము అక్కడకు శోధనల నిమిత్తమై పోయిన వైద్యులు నెలల కొలది నివసించియు చలిజ్వరపు పాలబడకుండ తప్పించుకొని యున్నారు.

తమయింటినంతను దోమలు చేరకుంద కాపాడుకొన లేనివారు తమశరీరమును మాత్రము దోమకాటునుండి మరియొక విధమున తప్పించు కొనవచ్చును. దోమలు సాధారణముగా కాళ్లుచేతులు మొదలగు కప్పబడి యుండని భారముల యందే కరచును. కావున ప్రొద్ధు గ్రుంకిన తోడనే ప్రతివారును, చేతులకును కాళ్ళకును మేజోళ్ళ వంటి గుడ్డ తొడుగులను పూర్ణముగా తొడుగుకొనవలెను. మనం మేలుకొని యున్నప్పుడు సమాన్యముగా దోమలు ముఖమీద కుట్టవు. ఒకవేళ ముఖముమీద కవి చేరినను, మనము వెంటనే వానిని తోలివేయుదుము. వీరు రాత్రులయందు దోమతెరతో చక్కగమూ