ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

105


యెడల వీనిలొ నొకప్పుడు నీరు చేరి దోమ పిల్లలకు అవి నివాసస్థానముగా నేర్పడును.

మన ఇండ్లలోనుండుదోమల నివాసస్థానములు.

నేను ఒకనాడు నాస్నేహితులకు కొందరకు దోమపిల్లలను చూపవలెనని ప్రయత్నించుచు, తొట్టిలోనైనను, పాత డబ్బాలలోనైనను, నిలవ నీరుండునేమో, ఆనీటిలో దోమపిల్లలు చిక్కునేమో యని ఇల్లంతయు దొడ్డియంతయు వెదకితిని. ఎక్కడ వెదకినను, దోమపిల్లలకు ఆధారమగుస్థలము నాకు దొరకలేదు. అయినను మాయింటిలో నప్పుడు దోమ లనేకములుండుట నేనెరిగినవాడ నగుటచేతను, ఆదోమలు ఇంటిలోనే యెక్కడనో పుట్టుచున్న వని నాకు గట్టి యనుమానము గలుగుట చేతను, నేను గదులలోను, అల్మారాలలొను వెదకుటకు ప్రారంభించితిని. కొంచె మించుమించుగ చీకటి కోణ మనదగు సామాను కొట్టునందు నాకు తుదకు ఒక నీటి పళ్లెరము కనబడెను. ఆపళ్లెములో ఒక అంగుళములోతు నీరుపోసి ఆనీటిమధ్య నొక ఇటుక పెట్టి దానిపై ఒక చక్కెరడబ్బా పెట్టబడియున్నది. ఆ పళ్లెరమును బైటికి తీసికొనివచ్చి పరీక్షింపగా 4-వ ప్రకరణమందు చూపబడిన దశలన్నిటియందు నుండు దోమపిల్లలు లెక్కింప శక్యముకానన్ని దానిలో నుండెను. బహుశ; ఆదోమపిల్ల లొక లక్ష యుండినను ఉండవచ్చును. ఆపిల్ల లన్నియు క్యూలెక్సు, స్టిగోమియా జాతులలోనివి. అందు