ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

చ లి జ్వ ర ము


గ్రెయినుల క్వయినాను నాలుగైదు అవున్సుల నీటి లోచేర్చి ద్రావకము చేసిగాని, మాత్రలుగ గాని పుచ్చుకొన వలెను. ఇందుచే దోమలు తమరక్తములో చలిజ్వరపు పురుగులను చేర్చినను ఆ పురుగులు వెంటనే నశించిపోవును. చలిజ్వరములుగల ప్రదేశములందు నివసింపవలసిన ఉద్యోగస్థు లనేకులు ఇట్లు క్వయినాను పుచ్చుకొని సంవత్సరముల కొలది ఈ జ్వరభాధ లేకుండ గడుపుదురు. ఇట్లు క్వయినాను తీసికొనుటవలన శరీరమున కేమియును చెరుపులేదు.

క్వయినా యొక్క సాయము కోరకయే చలిజ్వరమును నివారించు పద్ధతులు.

II. క్వయినా యొక్క సాయము కోరకయే చలిజ్వరమును నివారించు పద్దతులలో మూడు విధములు గలవు.

1.ఒక గ్రామము నందలి అనాఫలీసు దోమలను నశింపుచేయుట.

2. ప్రతి మానవుని దోమకాటునుండి కాపాడుట.

3. మనము కాపాడ దలచుకొనిన వారిని మాత్రము చలిజ్వరపు రోగులనుండి విడదీసి ప్రత్యేకముగ నివసింప జేయుట.

1.అనాఫలీసు దోమలను నశింపు చేయుట.

చలిజ్వరములుగల గ్రామమునందలి అనాఫలీసు దోమలను నశింపు చేసిన యెడల ఇతరులకు కొత్తగ