ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

101


ముగాదు. ఏలయన ప్రజలందరును అభిమానించు కొని ఒక కట్టుగా పనిచేసినగాని ఈపద్దతివలన చలిజ్వరము నశింపుగారు. ఒక్కరోగికి గ్రామములో మిగిలి యున్నను, దోమలు వానినుండి చలిజ్వరపు పురుగులను సంపాదించి వానిని పెంచి, యనేక వేలుగాచేసి, యనేకులకు పంచిపెట్టును. కావున ఐకమత్యముగాని, తగినంతకట్టు బాట్లుగాని లేని స్ధమలులలో ఈ పద్దతివలన ప్రయోజన మంతగా నుండదు. అయినను జయిళ్లలోను, పటాలముల లోను ఈ పద్దతి మిక్కిలి చక్కగ పనిచేయును. గ్రామములలో కూడా సాధ్యమైనంత వరకు అవలంబింప వచ్చును. ఎంత తక్కువమంది చలిజ్వరపు రోగులు గ్రామములో నున్నారో దోమలకు అంత తక్కువగా జ్వరపు విత్తనములు దొరకును గదా! దోమలకు చలిజ్వరము పురుగులు చాలినన్ని దొరకని యెడా వ్యాధి కొంతవఱకైనను తగ్గియుండును.

తాముమాత్రము వారమునకొకసారి క్వయినా పుచ్చుకొనవలెను.

2. గ్రామమంతయు గాపాడుటకు సాధ్యము కానప్పుడు తమ్ము మాత్రము చలిజ్వరమునుండి తప్పించుకొన దలచినవారు ప్రతివారును చలిజ్వర ముగల ప్రదేశములలో తాము నివసించుచున్న దినములును వారమున కొకసారి పది లెక పదిహేను