ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

చ లి జ్వ ర ము


దీనిని చేయు దూషణము, చేదువలన ప్రజలకు గలిగిన సహజద్వేషమును హెచ్చించును. సర్కారువారును, దిస్ట్రిక్టుబోర్డులును, మ్యునిసిపాల్టీలవారును, ప్రజల యుపకారమునకై క్వయినాను పంచిపెట్టినప్పుడు, ఆ పంచిపెట్టునది తియ్యనిమాత్రలుగా పంచిపెట్టినయెడల దీనివ్యాపకము ఇప్పటికంటె చలరెట్లు అదికము కాగలద్నినానమ్మకము.

జ్వరముచేత భాధపడునప్పుడు కొన్ని పొట్లముల నొకరోగికి కినినను, జ్వరము కొంచెము నెమ్మది యయినతోడనే ఈ పొట్లములలోని మందు చేదగుటచే వానిని పారవేయుచున్నారు. ఈమందే తియ్యగనున్న యెడల దానిని సామాన్యముగానా రోగివృధాచేయడు, తనకు గుణము తప్పక కనబడుచుండుటచే ఎంతవరక గత్యమో అంతమందును కొని యుపయోగించుకొనును

క్వయినాలలో నేదిమంచిది.

వైద్య శాలలోఫ్ సామాన్యముగ క్వయినా సల్పేటు అను దానిని ఉపయోగించెదరు. దీనినే మనవారు సాధారణముగా క్వయినా అని వాడుదురు. ఇది క్వయినా చేరిన మందులన్నిటిలో చౌక అయినది. దీనిని సామాన్యముగా నందరును వాడవచ్చును. ఒకానొక చోట క్వయినా హైడ్రోక్లేరైడు అనుమందు సల్పేటుకంటె వేగముగను,నిశ్చ