ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

95


చక్కెరఫాకములో పొదిపిన మాత్రలను ఇచ్చుట యుక్తము. ఈమాత్రలను ఎప్పటికప్పుడు క్రొత్తగా తయారుచేసికొనుచుండ వలెను. ఏలయన మాత్రలు ఆరిపోయి మిక్కిలి గట్టిపడినయెడల నవి జీర్ణకోశములో జీర్ణముగాక మలము నందుపోయి మందంతయు వృధా యగును. అందు చేతనే ఒక్కొకప్పుడొక్కొక్క రోగికి ఎన్నిదినములు ఎన్నిమాత్రలు ఇచ్చినను జ్వరము కుదురక యొకనాడు విరేచనములకు మందిచ్చిన ఆ మాత్రలన్నియు మలములో నొక్కపెట్టున ఉండలుండలుగా వెలువడును.

చక్కెరలో పొదివిన మాత్రల ఉపయోగము.వాలు పాఠ్యం

అయినను చక్కెర పైకప్పుగలమాత్రలు త్వరగా జీర్ణ మగునుల్. వానిని సామాన్యముగా నుపయోగింప వచ్చును. సర్కారువారు చలిజ్వరముగల ప్రదేశములలో క్వయినా పొట్లములను ఉచితముగ పంచిపెట్టుచున్నారు. కొద్ది నలలకు తపాలాఫీసులో అమ్ముచున్నారు.ఈమందు చేదుగ నుండుటచేత ప్రజలలో నంతగా హితవుగా వ్యాపకమగుటలేదు. ఇదిగాక ఇట్టిపద్ధతి ప్రజలకు క్వయినా యందుగల అనిష్టమును హెచ్చించుచున్నది. ఊరక వచ్చుచున్నందు వలన, వారికి దానివిలువ తెలియక పోవుటచేతనే సామాన్య ప్రజలు అట్టి పద్దతివలన లాభములను పొందనేరరు. దీనికి తోడు నేను ఇదివర లో చెప్పియున్నట్లు అజ్ఞానులగు వైధ్యులు