ఈ పుట ఆమోదించబడ్డది

40. ఆ|| నాల్గువిధములైన నాయకుల్‌ గలరంచు
చదివియుంటి నేను శాస్త్రములను
ధీరలలితుడవని పేరుకొందును నిన్ను
వినుతమతివి నీవు వినుసినారె!

41. తే|| ఉగ్గుపాలతో నేర్చిచు ఉర్దుభాష
తల్లిబాసలో నీవెంతొ తనరినావు
రెండుభాషలపైన పట్టుండు కతన
నీదుకైతలు పదునెక్కె నెఱిసినారె!

42. తే|| నచ్చితే నాల్గు మాటలు మెచ్చుకొనుచు
నచ్చకున్న చోట సభయనంతరమ్ము
సౌమ్యరీతిని చెప్పెడి సాధుమతివి
ప్రేమమార్గమ్ము నీదయ్య వినుసినారె!

43. తే|| ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వమం దతులరీతి
భాష సాంస్కృతిక విషయ పథములందు
సూచనలు సేయు సలహాల సూత్రధారి
పదవినందితే ప్రతిభతో వరసినారె!

44. తే|| దక్షిణపు భారతమునుండి దక్షమతిగ
రాజ్యసభకు మొట్టమొదట రాజసముగ
పదవి పొందిన కవిరాజువయ్య నీవు
వాసికెక్కిన వాడవు వరసినారె!