ఈ పుట ఆమోదించబడ్డది

26

బొబ్బిలియుద్ధనాటకము.

              చిత్తజు ని కాఁక హత్తి సొలసి సోలి, మిత్తిని దలపోసెరా !
                   నాసామి, ఆ మిత్తిని దల ...
              "వల్లభు నిమది క ల్లని యెఱుఁగక చెల్ల ! కల్ల యైతి నే!
                   ఓ చెల్ల ! తాఁజెల్లఁ గల్ల ...
              ఇంత కాలము నేను జింతించి నవి యెల్ల గొంతమ్మ కోర్కులఁటే?
                   ఓ చెల్ల ! ఆ గొంతమ్మ కోర్కు ..."
              సారసా క్షి యిట్లు *[1]కేరుచు నే నిన్నుఁ గోరుచు నున్నదిరా !
                   నాసామి, నిన్ గోరుచు ...
              మత్తచ కోరాక్షి గుత్తంపు గాజులు గుత్తిగ రాలెనురా !
                   నాసామిగా గుత్తిగ రా ...
              ఉంగ రా లు కేల ముంగాము రాలైన సింగారిఁ గందువురా;
                   నాసామి, ఆ సింగారిఁ గం ...
              వన్నెము త్తెసరాలు సున్నమ యినయా కన్నియఁ గందురారా
                   నాసామి, ఆకన్నియఁ గందు ...

[పిరంగి యగాదు. స్త్రీలు హల్లకల్లోలపడుదురు. నేపథ్యమున] ఇదేమి తమ్ముఁడా ఊరిబయటినుండి యెంత విపరీతపు ఫిరంగిమ్రోతఁ వినఁబడుచున్నది!

వేంకట [ఆలకించి నిర్వర్ణించి, రాణిని ఉద్దేశించి] అమ్మా, ఏలినవారు వెంగళరావుగారితో ఇక్కడికే వచ్చుచున్నారు. [వేంకటలక్ష్మి తప్ప అందఱును నిష్క్రమింతురు.

[అంతట రంగారావును వేంగళరావు సంభ్రాంతులుగా ప్రవేశింతురు.]

రంగ. -

          క. దిక్కులవియఁ బాతాళము
               గ్రక్కదలఁగ గడ్డ గడ్డగా ఘూర్ణిల్లినా
               యక్కుగవి సొచ్చి సరవిన్
               దక్కుఁడు తక్కుఁడయిమ్రోత తడవుగ డిందెన్. ౨౬

వెంగళ. - ఇదేమో విపరీతముగా నున్నది.

  1. * పా. దూరుచు.