60 బిల్వమంగళ [అం 3
మెరుగంగజాలునా ♦ యీశునిక్కువము.
సదయుడైభక్తునకు ♦ సర్వేశ్వరుండె
ఒందగోరినరత్న ♦ మొడివడచేయు.
ఆకస్మికంబుగా ♦ నరుదెంచిగురువు
ఉపదేశమొనరింప ♦ సూడు సందియము.
చిత్తనైర్మల్యమున ♦ చిగురొత్తు నాశ
ఈశునివాక్యమని ♦ యెన్ని నిమిత్త
గురువును మన్నించు ♦ సురుభక్తితోడ-
ప్రత్యయంబున పొడము ♦ ప్రాణికి లాభ
మీశ్వరుడే కర్త ♦ యెందునకైన,
మానవుండు నిమిత్త ♦ మాత్రుడుసుమ్ము.
విశ్వాసముదయించు ♦ విశ్వేశుకృపను.
వాగ్రూపమునబ్రహ్మ ♦ పరలుచున్నాడు,
దానినెరిగినవాడె ♦ తత్వజ్ఞుడగును.
బిల్వమంగళుడట్టి ♦ విజ్ఞుండుగాన
నతడు గురువగు నాకు ♦ నతనిశిష్యుడను
ప్రేయసుడాత డే ♦ ప్రేమహీనుండ
ఎప్పుడుపొడమునో ♦ ప్రేమ నామదిని?
వత్సపోవుదమింక ♦ వానివెదకుచును...(పోదురు)
(బిల్వమంగళుడు వచ్చును)
బిల్వ - చిత్తమా, తత్తరపడకు స్థిరముగా నుండు.. నీచపలత్వము విడువవా? పొమ్మెంతదూరము పోదువో...