పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/25

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22 బిల్వమంగళ [అం 1

నాల్గో రంగము

(శ్మశానములో నొక చితివక్క పిచ్చిది కూర్చుండగా బిల్వ

బిల్వ - ఇక్కడికి రెండుకోసుల దూరాన ఇంకో రే వుంది, అక్కడ జాలరివాళ్ళ పడవలో చిన్ననావలో ఉండక మానవు - అంతదూరము పోనక్కర లేకుండా ఇక్కడే తెప్పగాని, లేక దుంగగానీ, దొరికితే బాగుండును. విడిచేతుల నీదడము కష్టము. ఈచుట్టుపక్కల వెదకుతాను. అబ్బా! ఆకాశము చిల్లిపడ్డట్టు ముసలధారావృష్టి! ఇంద్రునికి కోపము వచ్చింది కాబోలు? ...నేను రాకపోతే తాను వస్తానంది, పాపము, అద్దరి నది నావలె నడుస్తూంటుంది...హా! ప్రాణేశ్వరీ! మనమిద్దరమూ చక్రవాకమిధునములాగు విరహవ్యధ ననుభవిస్తూన్నాము కదా? మనల ఈయేరుఎడబావుతూన్నది. ..ఈతుప్పచాటున వెలుగేమి? చితిమంట ఏమో? కాలమను నది కలకాలమూ పారుతూనే ఉండును. ఒకరికై కనిపెట్టుకొని యుండక దానితోవ నది పోతూండును...నా కాకలి చేత ప్రాణములు పోవునట్లున్నవి...తుపాను పట్టినట్లుంది. పిశాచములు పోరునట్లు మేఘములు గర్జించుతూన్నవి. ప్రాణమా, నీవు తుచ్ఛమని భావించియుందును గాని చింతామణి దర్శనమునకు వెలియౌదును కదా అని వెరచుతూన్నాను... ఏమి చేయుదును? దాని ప్రాణాలూ ఇట్లే ఉండును, కాని ఆదది, అబల - ఏమిచేయగలదు? లేకుంటే ఏరుదాటి నన్ను