పుట:Bibllo Streelu new cropped.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది

శత్రుసైన్యాన్నిఎదుర్కొన్నాడు. పైగా వారికీ 900 ఇనుపరథాలు వున్నాయి. కాని దెబోరా స్వపక్షానికి ధైర్యం నూరిపోసింది. యుద్ధంలో వానకురిసి విరోధి రథాలు బురదలో కూరుకొని పోయాయి. సీప్రా ఓడిపోయి యాయేలు గుడారం ప్రవేశించాడు. ఆమె కణతల్లో మేకు దిగగొట్టి అతన్ని చంపివేసింది. దెబోరా ప్రవచించినట్లే యిస్రాయేలు గెల్చి శత్రువుల పీడను తప్పించుకొన్నారు.

  సీస్రా ఒక ఆడకూతురు చేతికిజిక్కి చచ్చాడు. ఈయాడకూతురు ఎవరు? యాయేలు కావచ్చు. డెబోరా కూడ కావచ్చు. ప్రజలను యుద్ధానికి ప్రేరేపించింది, పోరు నడిపించింది ఆమె కదా! దెబోరా విజయగీతం పాడింది. ఆ సంగ్రామంలో నక్షత్రాలే యిప్రాయేలు తరపున పొరాడాయుట - 5,20. దెబోరా వీరనారి. యిప్రాయేలును యుద్దానికి ప్రేరేపించి వారికి విజయాన్ని చేకూర్చి పెట్టింది. న్యాయాధిపతిగా, సంరక్షకు రాలిగా, తన బాధ్యతలను వీరోచితంగా నిర్వహించింది. శతాబ్దాలపొడుగున ఆమె యెంతోమంది బైబులు పాఠకులకు ప్రేరణం పుట్టించింది. ఎందరో బాలికలు ఆమె పేరు పెట్టుకొన్నారు. నేడు మన బాలికలకు కూడ ఈ పేరు పెట్టి వారిలో ఉత్సాహం, ధైర్యం, కార్యదీక్ష అనేగుణాలను మేలుకొల్పాలి

19. దహనబలిగా అర్పించుకొన్న యెఫ్తా కూతురు

యొఫ్త న్యాయాధిపతిగా వున్న కాలంలో అమ్మోనీయులతో యుద్ధం వచ్చింది. అతడు నీవు నాకుయుద్ధంలో విజయాన్ని ప్రసాదిస్తే నేను నా యింటినుండి ఎదురు వచ్చిన వారిని ఎవరినైనాసరే నీకు దహనబలిగా సమర్పిస్తాను అని దేవుని ముందు ప్రమాణం చేశాడు. ఇది తొందరపాటు ప్రమాణం.

అతడు ఏ కుక్కో బానిసో ఎదురువస్తారు అని భావించాడు. అతనికి ఒకతే కూతురు. సరే దేవుని ఆత్మ అతనిమివాదికి బలంగా