పుట:Bibllo Streelu new cropped.pdf/25

ఈ పుట ఆమోదించబడ్డది

సంతానం కొరకు తామారు అతన్ని వివాహమాడింది. కాని అతనికింకా వయసు రాలేదు. పైగా దేవుడు అతన్ని కూడ హతమారుస్తాడేమో నని యూదా భయపడ్డాడు. కనుక యూదా షేలాను తామారు దగ్గరికి పోనీయలేదు. ఆమెను పుట్టింటనే వుండమని ఆజ్ఞాపించాడు. ఇంతలో యూదా భార్య చనిపోయింది.

తామూరు పుట్టింటనే విధవా జీవితం గడుపుతూంది. ఏరుకి సంతానాన్ని కలిగించాలనే వాంఛ ఆమెను బలంగా ప్రేరేపించింది. యూదా షెలాను కోడలిని కూడనీయలేదు. కనుక తామారు మామ ద్వారానే సంతానాన్ని పొందగోరింది. ఇంతకు ముందు ఆమె మూడుసార్లు బిడ్డను పొందగోరి విఫలమైంది కదా!

ఆమె విధవా వస్త్రలను తొలగించి వేశ్యలా నటిస్తూ తలపై మేలి ముసుగు వేసికొని దారి ప్రక్కన కూర్చుంది. యూదా ఆ దారిన తిమ్నాతు నగరానికి వెళ్తూ తామారును చూచాడు. కాని ఆమె సొంత కోడలని తెలియక ఆమెను సమిపించాడు. ఆ వేశ్యను కూడినందుకు కానుకగా ఓ మేక పిల్లను పంపుతానని బాస చేసాడు. మేక పిల్లకు బదులుగా తన ముద్రను దాని త్రాటిని, చేతి కర్రను తామారుకు కుదువ పెట్టి ఆవెును కూడాడు. తామూరు గర్భం తాల్చి పుట్టింటనే వసిస్తూంది-38, 16-18.

మూడు నెలలైన తర్వాత తామారుకి కడుపైందని వార్తలు వచ్చాయి. యూదా కోడలు ఎవరి వల్లనో గర్భం దాల్చిన కులట గనుక ఆమెను కాల్చి చంపాలని పట్టుపట్టాడు. కాని తామారు అతడు కుదువ పెట్టిన వస్తువులను చూపించి నేను వీటి సొంతదారుని వల్లనే గర్భం దాల్చాను అని ప్రకటించింది. ఇక యూదా తన తప్పిదాన్నిఅంగీకరింపక తప్పలేదు. అతడు కోడలు నాకంటే నీతిమంతురాలు. నేను ఆమెను షేలాకు సమర్పింపలేదు. కనుక ఇంత పని జరిగింది అని పల్కా-38.26. అతడు కామవాంఛతో కోడలిని కూడాడు. కాని