పుట:Bibllo Streelu new cropped.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రురాలైన భార్య జ్ఞాపకార్థం ఓ స్తంభాన్ని నెలకొల్పాడు. ఆమె సమాధిని తర్వాత వచ్చిన యిస్రాయేలు ప్రజలు పవిత్ర స్థలంగా భావించారు. యూదులు ఇప్పటికీ నవ వధువులను విూరు లేయ రాహేళ్లలాగ పెంపుజెందండని దీవిస్తారు. ఈ యుక్కా చెల్లెళ్లిద్దరూ జాతి మాతలుగా గణుతికెక్కారు.

రాహేలు ప్రసవ వేదనతో చనిపోతూ తన కుమారుని కొరకు శోకించింది. వెయ్యేండ్ల తర్వాత యూదులు బాబిలోనియాకు ప్రవాసానికి వెళ్లారు. ఈ వుదంతాన్ని యిర్మియా ప్రవక్త "రా హేలు తన బిడ్డల కొరకు శోకించింది” అని వుత్ర్పేక్షించాడు–యిర్మీ 31, 15. ఇంకో ఏడువందల యేండ్ల తర్వాత క్రూరుడైన హేరోదు పావన శిశువులను చంపించాడు. ఈ వుదంతాన్ని పురస్కరించుకొని మత్తయి మళ్లా పై యిర్మియా ప్రవచనాన్ని ఉదహరించాడు. రాహేలు తన బిడ్డల కొరకు విలపించింది అని చెప్పాడు -మత్త 2,18. ఈ రీతిగా రాహేలు యిస్రాయేలు ప్రజలు స్మృతిపథంలో సజీవవ్యక్తిగా నిలిచి పోయింది. ఆమె ప్రణయమూర్తి, విషాదహృదయ, జాతిమాత.

6. భర్త ప్రేమకు నోచుకోని లేయా

లేయ రాహేలుకు అక్క కాని ఆమె చీకురు కండ్లది. చెల్లెలి కున్న అందంలేదు. తండ్రి, భర్త ఆమెను అనాదరం చేశారు కనుక ఆమె మానసికంగా బాధపడేది.

యాకోబు రాహేలును ప్రేమించి ఆమెకొరకు ఏడేండ్లు మామకు చాకిరి చేసాడు. కాని లాబాను వంచకుడు. అల్లునికి రాహేలునిస్తున్నట్లే నటించి లేయానిచ్చి పెండ్లి చేశాడు. భార్యను కూడిన పిదపకాని యాకోబుకు ఆ మోసం అర్ధం కాలేదు. బహుశా లేయా కూడా ఈ వంచనలో భాగస్తురాలై వుంటుంది-29, 15-30. తర్వాత యాకోబు ఇంకో యేదేండ్లు మామకు చాకిరి చేసి రాహేలును గూడ పెండ్లి చేసికొన్నాడు. మామ చేసిన మోసం వల్ల యాకోబుకు లేయా మీద