ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బైబుల్ సామెతలో ఐహికం నుండి ఆముష్మికం లోకి ఒక వ్యక్తి కర్మఫలం అతణ్ణి అనుసరిన్తూ పోతుందనే భావం ఉంది. శరీరంతో ఉండగా చేనసిన పాపపుణ్యాలు తనువు చాలించాక ఆ వ్యక్తి స్వర్గ నరకాలను నిర్ణయిస్తాయనేది ధార్మికులు సామాన్యంగా నమ్మే సత్యం.

6

తెలుగు సామెత : తానొకటటి తలచిన దైవమొకటి తలచును

బైబులు సామెత : నరులు ప్రణాళికలు వేసుకొనవచ్చును. కాని దైవ సంకల్పమే నెరవేరును(సామెతలు 19:21)

ఇది విశ్వవిఖ్యాత సత్యం. మానవుడు ప్రతిపాదిస్తాడు. కానీ జరిగేది మాత్రం దైవ సంకల్పానుసారమే జరుగుతుందనే భావం ఇమిడి ఉన్న సామెతలు అన్ని సంస్కృతులలోనూ కనిపిస్తాయి. అందుకే

'థశరథుండు రాముధరణికి పట్టంబు

గట్టదలచె, నపుడు కట్టె జడలు తలపు మనది కాని దైవిక మదివేరు' అని వేమన కూడా అన్నాడు.

తన జ్యేష్ఠ పుత్రుడు సకల గుణాభిరాముడు అయిన రామభద్రుని రాజ్యాభిషిక్తుణ్ణి చేయ తలపెట్టి సర్వ సన్నాహాలు పూర్తి చేశాడు దశరథ మహారాజు. కానీ ఏమి ప్రయోజనం? నవరత్న ఖచిత రాజ మకటుటం విరాజిల్లవలనసిన తలపై కేశాలు జడలు గట్టాయి. రాజ్యమేలుతాడనుకున్న రాముడు కారడవుల పాలయ్యాడు.

దైవం, విధి, తలరాత, కర్మఫలం. . . ఇలా పదమేదైతేనేమి? మనషులంతా గుర్తించిన సత్యమిదే. మనం పథకం వేసుకొని దాన్ని జరిగించుకోగలిగిన పరిన్థితి లేదు. అనుకటున్నది అనుకున్నట్టు జరిగితే ఆనందించడమే తప్ప, అనుకోనిది జరిగితే చింతించి ప్రయోజనం లేదు. అందుకే జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నారు పెద్దలు.

బైబులు ఈ విషయాన్ని సందర్భోచితంగా పలుమార్లు నొక్కి చెప్పింది, భక్తిపరులు, భక్తి,హీనులు అని లేకుండా ప్రతి ఒక్కరూ ఏవేవో ప్రణాళికలు అల్లుకోవడం, చివరికి విధి బలీయమన్న నత్యాన్ని అనుభవ పూర్వకంగా గ్రహించడం బైబులు చరిత్రలో

281