ఈ పుట ఆమోదించబడ్డది

చుట్టము, లేక స్నేహితుడు అనేవాడు అన్ని సమయాలలోను తన స్నేహితునికి అండగా ఉండాలి. కేవలం తనకు ఆపద, లేక అవసరం వచ్చినప్పుదే స్నేహితుని కోసం పరుగెత్తుకొని వచ్చేవారు అసలైన మిత్రులు కారు. ఇలాంటివారు"మీ ఇంటికొస్తే మాకేమిస్తారు? మా ఇంటికొస్తే మీరేం తెస్తారు?" అనే స్వభావం గలవారు. స్నేహమనేది యేకపక్షంగా వుండకూడదు. అలా ఉంటే అది అక్కర తీరడానికి నటించడమౌతుంది గానీ స్నేహమనిపించుకోదు. అక్కరకు వచ్చేవాడే, లేక ఆపదలో ఆదుకొనేవాడే నిజమైన స్నేహితుడు. ఆ విధంగా కాకుండ కేవలం తన స్వార్ధం కోసమే స్నేహితుని ఉపయోగించుకొని, అతడు ఆపదలో చిక్కుకొనగానే ఆదుకొనకుండా ముఖం దాటవేసేవాడిని వెంటనే విడిచిపెట్టాలి. వాని వల్ల ఎటువంటి మేలు కలుగదు. ఈ విషయాన్నే బద్దెన సుమతీ శతకంలో -

'అక్కరకు రాని చుట్టము

మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా

నెక్కిన బారని గుఱ్ఱము

గ్రక్కున విడువంగ వలయుగదరా సుమతీ' అంటాడు.

కాగా స్నేహితుడనేవాడు కష్ట సుఖాలలో, కలిమి లేముల్లో ఒకే విధంగా ఉండి అవసరమైనట్టు చేదోడువాదోడుగా ఉండాలి. అందుకే స్నేహితునికి, స్నేహానికి జీవితంలో ఉన్నత స్ధానం కల్పించారు ప్రాజ్ఞులు! "చెడి స్నేహితుని ఇంటికి వెళ్ళవచ్చును గాని సోదరుని ఇంటికి వెళ్ళకూడదు" అంటారు పెద్దలు. అందుకే రక్త సంబంధుల కంటే నిజమైన స్నేహితుడే ఆప్తుడని అంతరార్ధం. స్నేహమంత తీయనిది మరేదీ లేదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. కనుక అక్కరకు వచ్చినవాడే, లేక ఆపదలో కూడా ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని ఈ సామేత భావం!

మంచి మిత్రుడు, నిస్వార్ధ ప్రేమ ఎలా ఉండాలో తెలియజేస్తున్నది బైబులు సూక్తి. ఈ లోకంలో ఒకరి కోసం ఇంకొకరు మరణించరు. ఒకరి తప్పు వేరొకరు భరించరు. సాధారనంగా ఆపదలో చిక్కుకున్న నాడు ఎవరూ దగ్గరకు కూడా రారు (లూకా సువార్త 10:36 'మంచి సమరయుని ' ఉపమానం). యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయనతో స్నేహితుడు, లేక పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించాడు. అందుకు యేసు ఒక కధ చెప్పాడు, ఒకడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి పోతున్నాడు. దారిలో అతణ్ణి దొంగలు

81