ఈ పుట ఆమోదించబడ్డది
2

తెలుగు సామెత : పుటము వేసినదే బంగారం

బైబులు సామెత : వెండి బంగారములను కుంపటి పరీక్షించును (సామెతలు 17:3)

వెండి, బంగారములు మానవుల దృష్టిలో అమూల్యమైనవి, శ్రేష్ఠమైనవి. కానీ అవి ఎప్పుడంత విలువను సంతరించుకున్నాయి? నిప్పులో వాటిని కాల్చి వాటిలోని మలినాలన్నింటినీ తొలగించినప్పుడే అవి స్వచ్ఛముగా తయారవుతాయి. లేకపోతే వాటికి అంత విలువ ఉండదు. ఎవరూ వాటిని మక్కువతో కొనుక్కోరు కూడా! అట్లాగే కష్టాలు, కన్నీళ్ళు మానవుని ధీరత్వాన్ని పరీక్షించడానికే వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిత్వముతో, ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిగా ఎదుగుతాడు. కాబట్టి కష్టాలు, కడగండ్లు వచ్చినపుడు క్రుంగిపోకుండా వాటిని అధిగమించి మరింత మెరుగైన ఆత్మ విశ్వాసముతో ముందుకు సాగేందుకు వాటిని ఉపయోగించుకోవాలి. వాటిని దాటి ముందుకు సాగినవారు విజయాన్ని పొందుతారు. కష్టాలు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా, వాటి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని రెండు సామెతలూ బోధిస్తున్నాయి.

ఉదాహరణకు హరిశ్చంద్రుణ్ణి సత్యవాక్పరిపాలకుడని మనం శ్లాఘించేది అతడు షట్చక్రవర్తులలో ఒకడై వైభవోపేతంగా పరిపాలన నెరపుతున్న కాలానికి పరిమితమైనందుకు కాదు. అతడు రాజ్యభ్రష్టుడై కానలపాలై, భార్యా వియోగం పుత్రశోకాదులతో తల్లడిల్లిన సమయంలో కూడా అతని సత్య నిష్ఠ అకుంఠితంగా నిలిచినందుకే అతడు శ్లాఘనీయుడు. అలాగే మహా సంగ్రామం ముంచుకువచ్చిన తరుణంలో కర్ణుడు తన సహజ కవచ కుండలాలను విప్రునికి దానమియ్యవలసిన పరిస్థితి. ఆ అగ్ని పరీక్షే అతనికి దానకర్ణుడనే బిరుదును సార్థకం చేసింది అని గ్రహించాలి.

స్నేహము
1

తెలుగు సామెత : అక్కరకు వచ్చినవాడే అయినవాడు

బైబులు సామెత : స్నేహితుల కొరకు ప్రాణమిచ్చువాడే నిజమైన స్నేహితుడు

(యోహాను 15:13)
80