ఈ పుట ఆమోదించబడ్డది

కొందరు కొండ విరిగి మీద పడినా, చలించకుండా ఉంటారు. మరికొందరు యేకాస్త అసౌకర్యం,అలజడీ కటలిగినా విలవిలలాడిపోతారు. జరిగేది ఎలాగూ జరుగుతుంది. మనం గట్టిగా నిలబడినా,అటూ ఇటూ పరువులెత్తినా రానున్నది రాక మానదు, పోనున్నది పోకమానదు.గాలికి పరుగెత్తే పొట్టులాగా తేలిపోకుండా గట్టిగా నిలబడి ఉంటే, ఏనాటికైనా అనుకున్నది సాధించవచ్చు.అటువంటి నమయాన్ని సందర్భాన్ని వివరిన్తూ పై తెలుగు సామెత పుట్టింది.'ఉండేది గట్టి,పోయేది పొట్టు'అనడంలో గట్టిదానికి పట్టం కట్టాలి. ఉన్నవానికే ఫలితం లభిన్తుంది కాని, చంచలుడై అటూ ఇటూ పరుగులెత్తేవానికి ఏదీ అందదు.కాబట్టిఎన్ని ఆపదలొచ్చినా, దృఢచిత్తంతో నిలబడి విజయం సాధించాలి. పొట్టులాగా గాలికి తేలిపోకుండా గట్టిగా నిలబడి జీవించమని తెలియజేయడమే ఈ సామెతలోని అంతరార్థం.

     బైబులు సామెత కూడా ఇదే అర్థాన్ని అందజేన్తుంది. కళ్ళంలో  తూర్పారపట్టే నమయంలో పొట్టు దూరంగా కొట్టుకొని పోతుంది.గట్టిగింజలు క్రింద నిలబడతాయి. పొట్టును అగ్నితో కాల్చివేని, గట్టి గింజలను ఇంటికి తీసుకుపోయి ఉపయోగించుకుంటారు. కాగా మానవులు గట్టి గింజల్లాగా ఉండాలి. అందరికీ ఉపయోగపడాలి. ఈ సామెతలో దుర్మార్గుడు పొట్టుతో పోల్చబడ్డాడు. చంచలుడై, దుర్మార్గుడై, నిరుపయోగంగా నశించకుండా, గట్టిగా, స్థిరమైన పునాది మీద నిర్మించబడిన సౌధంలాగా నిలిచి జీవించమని ఈ బైబులు సామెత బోధిన్తుంది.
   ప్రతివాడికీ బెదరిపోయి, ప్రతిగాలికీ చలించిపోయి, ప్రతి నంఘటనకు విపరీతంగా ప్రతిస్పందిస్తూ మనం శాంతి సమాధానాలతో జీవించలేము. ధైర్య సాహసాలు కలిగి, నిర్భయంగా, నిశ్చింతగా జీవించాలి. మనం పరుగులెత్తితే, లోకం ఇంకా చులకన చేసి మనల్ని తరుముతుంది. మనం స్థిరంగా నిలబడితే లోకం తోకముడిచి,వెనక్కు తిరుగుతుంది.ఇదే భావాన్ని తెలుగు, బైబులు సామెతలు తెలియజేన్తున్నాయి. ఉండేది గట్టి, పోయేది పొట్టు. దుర్మార్గుడు కళ్ళంలో గాలికెగిరి పోయే పొట్టులాంటివాడు.
                 101