ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధానులంతా నీతాపహరణాన్ని సమర్థించారు. నీతికోవిదుడు,సాధుజీవీ అయిన విభీషణుడు మాత్రం ముంచుకు రానున్న వంశ నాశనాన్ని ఊహించి అగ్రజునికి మంచిమాటలు చెప్పబూనుకున్నాడు.ఫలితంఛీత్కారం, దేశ బహిష్కారం శత్రువుతో చేయి కలిపాడన్న అపకీర్తి.ఇది మూర్ఖులతీరు.

                        12

తెలుగు సామెత : మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ బైబులు సామెత : మూర్ఖుడు నూరు దెబ్బలకు నేర్చుకొనలేనిది

             వివేకశాలి ఒక్క మందలింపుతో నేర్చుకొనును 
             (సామెతలు 17:10)
 పశు జన్మకన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనది.మానవుడు బుద్ధిజీవి. దె కార్తె అనే మేధావి మనిషిని నిర్వచిన్తూ "నేను ఆలోచిస్తాను గనుక నేను మనిషిని" అన్నాడు . జంతువులు కేవలం  సహజ సంవేదనల సాయంతో స్పందిస్తుంటాయి.మనిషిలో ఉన్న ఆలోచన,వివేచన,విచక్షణలు అతనిని జంతువులకు భిన్నంగా నిలుపుతున్నాయి.
 గ్రామీణ జీవితంలో అందరెరిగిన నత్యాన్ని మరికొంత ఉన్నతాదర్శాన్ని వెల్లడించడం కోనం సంక్షిప్తంగా బలంగా చెప్పినదే ఈ తెలుగు సామెత. పశువులను కూడా కాపరులు అదిలింపులతో అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు.చాలావరకు పశువులు నైతం ఇలాంటి అదిలింపులకు స్పందిస్తాయి. తరచుగా ఒక దెబ్బ కూడా అవసరమవుతుంటుంది.ఇది ప్రకటృతి సహజం.
 కాని సామెతలో అంతర్లీనంగా ఇలాటి ప్రకృతి ధర్మాలను ఆసరాగా చేనుకొని చేనే జ్ఞాన బోధ కూడా అనివార్యంగా ఉంటుంది. సులువుగా బలంగా, ప్రకృతి ధర్మాన్ని చెబుతూ చక్కని హెచ్చరికను తెలుగు సామెత చేస్తుంటే,బైబులు సామెతమరింతవివరంగా,సూటిగా,హీనుల జ్ఞానహీనతను ఎత్తిచూపుతూ కర్తవ్యబోధ చేన్తున్నది.
     మనుషుల్లో పశుప్రాయులుంటారు.మాటలతో వారిలో పరివర్తనం కలుగదు.అందుకే"దండం దశగుణం భవేత్‌"అన్నారు ఆర్యులు.మాటలతో వినకుంటే బెత్తం వాడవలసిందే. అది మనుషులు విధించే శిక్ష కావచ్చు, లేక తన అవివేకం వల్ల ఒకనికి సంప్రాప్తించే శిక్షకావచ్చు.శ్రేయోభిలాషులు ఎంత చెప్పినా వినక అదే
                       97