ఈ పుట ఆమోదించబడ్డది

కొంతమందికి తమకు మేలుచేసే వారెవరో, కీడు చేసేవారెవరో తెలియదు. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ కూడా ఉండదు. ఒక్కొక్కసారి తమ హితులను, స్నేహితులను కూడా తూలనాడి, దూరం చేసుకుంటారు. పిచ్చివాళ్ళూ తమకు ఆధారమైనదాన్నే జారవిడుచుకుంటారు. అన్నం పెట్టేవాళ్ళనే అలక్ష్యం చేసి దూరం చేసుకుంటారు. ఇటువంటి అవివేకులను గూర్చి తెలియజేయడానికి ఈ తెలుగు సామెతను ప్రయోగిస్తారు.

    బైబులు సామెత కూడా ఈ కోవకు చెందినదే. మూఢురాలు తన ఇంటిని తానే ఊడబెరుకుతుంది. ఇల్లు కట్టడం చాలా కష్టం. జ్ఞానంతో ఇల్లు కట్టుకొనేవారు కొందరైతే మూర్ఖులు తమ ఇళ్ళను తామే పడగొట్టుకుంటారు. అంటే తమను తామే నాశం చేసుకుంటారు. ఈ బైబులు సామెత కూడా తెలుగు సామెతకు నమానార్థకమే.
   ఈనాడు ఆత్మహత్యా సదృశ్యమైన అనేక కార్యాలు మానవులు చేన్తున్నారు. చేజేతులా జీవితాలను నాశం చేసుకుంటున్నారు. తమ ఆధారాలను తామే పోగొట్టుకుంటున్నారు. తాము కూర్చున్న, తమకు ఆధారమైన కొమ్మలను తామే నరుక్కుంటున్నారు. తమ ఇళ్ళను తామే పడగొట్టుకుంటున్నారు. కనుకనే ఈ తెలుగు సామెత, బైబులు సామెతలు సంఘంలో అధిక ప్రాధాన్యం నంతరించుకున్నాయి.
                5

తెలుగు సామెత : కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు బైబులు సామెత : ఒక మనుష్యుడు లోకమంతయు నంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకొనిన అతనికేమి ప్రయోజనము? (మత్తయి 16:26)

                                                                         అనవసరంగా,నిరుపయోగంగా శ్రమపడినపుడు శ్రమ నిష్ఫలదాయకమైనప్పుడు పై సామెతలను ఉపయోగిస్తారు.ఎలుకలు పట్టడం కోనం కొండలు, గుట్టలు ఎక్కనవసరం లేదు. వాటిని తవ్వనవసరమూ లేదు. మన ఇంటిలోను, పరినర ప్రాంతాలలోనూ ఎక్కబడితే అక్కడే ఉంటాయి ఎలుకలు. వాటి కోనం కొండను తవ్వడమంటే వృధా శ్రమ చేయడమన్నమాటే. మన పని ప్రయోజనకరంగా ఉండాలి.
                        88