ఈ పుట ఆమోదించబడ్డది

'ఉత్తమ గుణములు నీచున

     కెత్తెరగున కలుగ నేర్చునెయ్యడలందా 
     నెత్తిచ్చికరగబోసిన 
     ఇత్తడి బంగారమగునె యిలలో సుమతీ!" 
   ఈ సామెతలో ఉత్తమునికి ఉత్తమ గుణాలే తప్ప నీచమైన గుణాలు రావనీ, అలానే నీచునికి నీచమైన గుణాలే తప్ప ఉత్తమ గుణాలు రావని వివరించాడు బద్దెన. ఇత్తడిని ఎన్నిమార్లు కరిగించి శుద్ది చెసినా అది ఇత్తడిగానే ఉంటుంది గాని పుత్తడి (బంగారం) గా మారదని ఉపమానంగా చెప్పాడు. పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతోనే, అంటే కాష్టంలో కాలేటప్పుడే పోతుందని మరొక తెలుగు సామెత తెలుపుతున్నది. సహజ గుణం ఎన్నడూ మారదని దీని భావం. 
   బైబులు సామెతలో మూర్ఖునికి ఎన్ని చెప్పినా తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టడనీ, బోధించినా, బాధించినా అతడు మారడనీ, వాని సహజ గుణం మానుకోలేడనీ గ్రహిస్తున్నాము. 
   తెలుగు సామెత కూడా ఎన్నిసార్లు కరగించినా ఇత్తడి కానట్లే, నీచునికి ఉత్తమ గుణాలు ఏ విధంగానూ రావని చెబుతున్నది. ఇత్తడిని కరిగించినా బంగారం కాదు. మూర్ఖుని రోటిలో వేసి దంచినా వాని మూర్ఖత్వం పోదు. ఇవి రెండూ సమానార్ధకాలైన సామెతలు. ఇదే అర్ధాన్నిచ్చే సామెతలు అటు బైబులులోనూ, మన సంస్కృతిలోనూ కూడా మరెన్నో ఉన్నాయి. 

తెలుగు సామెత; ఏటివంకెవరు తీరుస్తారు?కుక్కతోక నెవరు చక్కజేస్తారు? బైబులు సామెత : వంగినదాని వంకర తీయలేము (ఉపదేశకుడు1;16

  పొట్లకాయ పిందెకు బరువు కడితే నిటారుగా పెరుగుతుంది. వక్రబుద్ది గల నరుని అంతర్యాన్ని సూటి చెయగలవారెవరు ? పై సామెతలలో నిగూఢంగా ఉన్న భావమిదే.