ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మీయంగా మసలుకొనే స్నేహితులుంటారు. జంక గొంక లేకుండా దేనికైనా నిద్ధపడి ఆపన్న ,హస్తమందించి ఆదరిస్తారు. మొత్తంమీద సోదరునింటికి పోవడం కన్నా స్నేహితునింటీకి పోవడమే మేలన్న నానుడిని తార్కికంగా నమర్థించడం కొంత కష్టమైనా జన సామాన్యంలో వాడుకగా జరిగేది ఇదే. అన్నదమ్ముల మధ్య ఏదో వికర్షణ, బెరుకు ఉంటాయి. స్వేచ్చగా మాట్లాడుకోవడం, సహాయాలు పరన్పరం చేనుకోవడం స్నేహితుల్లోనే సాధ్యం. ఇది తేటతెల్లమైన ధోరణి. దీనినే తెలుగు, బైబులు సామెతలు తెలుపుతున్నాయి.

       అయితే ఒకే రక్తం పంచుకుని పుట్టీన సోదరుల మధ్య చనువు, పరన్పర ఆనరా ఉండడం అత్యావశ్యకం. ఒకట తల్లి ప్రేమను పంచుకుని, ఒక ఇంట్లో బాల్య దినాలు గడిపి, కటుటుంబంలో కలిమి లేములు కలిసి సహించి, అనుభవించి, అనితర సాధ్యమైన బంధం పెంపొందించుకున్నవారు కడగండ్ల సమయంలో ఒకరికొకరు చేయూతనిచ్చు కోవడం అతి సహజంగా జరిగితే బావుంటుంది.
    బైబులు, తెలుగు సామెతలు రెండూ లోక వ్యవహరంలో కనిపించే ధోరణులనే వ్యాఖ్యానిన్తున్నాయి.

మూర్ఖత్వం

                    1

తెలుగు సామెత : ఎత్తెత్తిపోసినా ఇత్తడి బంగారమగునె? బైబులు సామెత : మూర్ఖుని రోటబెట్టీ దంచినను వాని మూర్ఖత్వమును తొలగింపజాలము (సామెతలు 27:22)

    సామెతలను పద్యాలలో పొదిగి తన సుమతీ శతకం ద్వారా వాటికి జన బాహుళ్యంలో అమితంగా ప్రచారం కలిగించినవాడు బద్దెన. ఈ సామెత ఇమిడి ఉన్న పద్యం -
                        84