పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/81

ఈ పుట ఆమోదించబడ్డది

అన్ని పుణ్యాలకు నిలయం విజ్ఞానమే.
 కనుక నరుడు దాన్ని సాధించాలి.
 జ్ఞానానికి మించిన సంపదలేదు
అన్నిటిచేత పనిచేయించేది అదే
బుద్ధిశక్తి అభిలషించదగినదైతే
జ్ఞానానికి మించిన బుద్ధిశక్తి యేమి వుంది?
 లోకంలోని వస్తువులనన్నిటిని నిర్మించిందదే
 పుణ్యం కోరుకోదగినదైతే
పుణ్యాలన్నీ జ్ఞానంనుండే పడతాయి
మితత్వం, న్యాయం, వివేకం, ధైర్యం
 మొదలైన వాటినన్నిటినీ జ్ఞానమే మనకు బోధిస్తుంది
 ఈ జీవితంలో వీటికంటె విలువైన వేవీలేవు - సాలొ జ్ఞాన 8, 5–7

5) జ్ఞానాన్ని ఆర్థించే మార్గమేమిటి? మొదట, పాపులకు విజ్ఞానం అబ్బదు
 మూరులు విజ్ఞానాన్ని బడయలేరు
 పాపాత్ముల కంటికి అది కన్పింపనైన కన్పింపదు
 గర్వాత్ములకు అది దూరంగా వుంటుంది
 అనృతవాదుల మనసులోకి అది ప్రవేశింపదు - సీరా 15, 7-8.

విజ్ఞానమంటే యేమోకాదు. దైవభయమే. భక్తులకు పుట్టువునుండే విజ్ఞానం లభిస్తుంది•

విజ్ఞానమెల్ల దేవునికి భయపడ్డమే
విజ్ఞానమెల్ల దైవాజ్ఞలను పాటించడమే
ప్రభువు సర్వాధిపత్యాన్ని గుర్తించడమే
ప్రభువుపట్ల భయభక్తులు చూపడం విజ్ఞానానికి మొదటి మెట్టు
భక్తులు మాతృగర్భంనుండే విజ్ఞానాన్ని పొందుతారు
దేవునికి భయపడ్డమే విజ్ఞానం, దుష్కార్యాలు విడనాడ్డమే వివేకం -సీరా 19,20. 1,14. యోబు 28, 28,

నరుడు ఎంత కృపైనాచేసి ఈ జ్ఞానాన్ని ఆర్జించాలి. విజ్జుల సూక్తులనుండి దాన్ని గ్రహించాలి.

కుమారా! బాల్యంనుండి ఉపదేశాన్ని నేర్చుకో
ముదిమి పైబడిందాకా విజ్ఞానాన్ని గడిస్తూండు