పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/77

ఈ పుట ఆమోదించబడ్డది

దేవునికుండే లక్షణాలే జ్ఞానానికీ వుంటాయి. కనుకనే అది ఓ దైవవ్యక్తి, అది నరుల్లోకి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులనుగాను ప్రవక్తలనుగాను మారుస్తుంది.

విజ్ఞానపుటాత్మ తెలివికలది, పవిత్రమైంది,
సూక్ష్మమైంది, చలనాత్మకమైంది, స్పష్టమైంది,
పరిశుభ్రమైంది, స్వచ్ఛమైంది, బాధింపరానిది,
మేలు చేసేది, చురుకైంది,
ఎదిరింప శక్యంకానిది, ఉపకారం చేసేది,
నరులతో స్నేహంచేసేది,
స్థిరమైంది, నమ్మదగినది, విచారానికి లొంగనిది,
సర్వశక్తి కలది, సర్వం పరీక్షించేది,
జ్ఞానాత్మకాలూ సూక్ష్మాలూ పునీతాలూ ఐన
ప్రాణులన్నిటిలోనికి ప్రవేశించేది,
జ్ఞానం కదలికకంటెగూడ త్వరగా కదులుతుంది
అది పవిత్రమైంది కనుక అన్ని వస్తువుల్లోకి ప్రవేశిస్తుంది.
అది దైవశక్తియొక్క శ్వాసం,
ప్రభువు తేజస్సు యొక్క స్వచ్ఛమైన ప్రవాహం,
మలినమైనదేదీ దానిలోనికి ప్రవేశింపలేదు,
అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపం,
దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించే నిర్మల ముకురం,
అతని మంచితనానికి ప్రతిబింబం,
అది వొంటిగా పనిచేసినా అన్నిటినీ నిర్వహిస్తుంది
తాను మారకుండానే అన్నిటినీ మారుస్తుంది
అది ప్రతితరాన కొందరు భక్తులలోనికి ప్రవేశించి
వాళ్ళను దేవునికి స్నేహితులనుగాను
ప్రవక్తలనుగాను మార్చివేస్తుంది
జ్ఞానాన్ని చేపట్టినవాణ్ణి మాత్రమే ప్రభువు ప్రేమిస్తాడు - సాలో జ్ఞాన 7, 22-28

3) విజ్ఞానంచేసే కార్యాలుకూడ బహుముఖంగా వుంటాయి. అది దేవుని సన్నిధిలో అటలాడుకొంటూంది. అతడు సృష్టిచేసేప్పడు ఓ శిల్పిలా అతని ప్రక్కనే నిల్చివుంది. సంతోషంతో మానవాళి మధ్య వసిస్తూంది. విజ్ఞానం ధర్మశాస్త్రం ఒకటే