పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/304

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. నూత్నవేద కాలానికి ఉత్తానాన్ని గూర్చిన భావాలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. నూత్నవేదం క్రీస్తు ఉత్థానాన్ని వర్ణిస్తుంది. ప్రభువు నయీను విధవా పత్రుజ్జీ, యాయిూరు కొమార్తనూ, లాజరునీ జీవంతో లేపాడు. ఇవి ఉత్థానాలు కాదు, పునర్జీవాలు. ఐనా ఈ సంఘటనలు క్రీస్తు ఉత్థానాన్ని సూచిస్తాయి. ఆ ప్రభువు ఉత్థానమూ మనలను కూడ లేపుతుంది. అతడు సజీవుడై లేచినట్లే మనమూ లేస్తాం.

యోహాను భావాల ప్రకారం క్రీస్తుని విశ్వసించడం వల్లా, అతని భోజనంగా స్వీకరించడంవల్లా, ఉత్థానాన్ని పొందుతాం. తమ్ముడు లాజరు చనిపోయినందుకు దిగులుపడుతున్న మూర్తతో ప్రభువు "నేను ఉత్తానాన్ని జీవాన్ని కూడాను. నన్ను విశ్వసించేవాడు మరణించినా మళ్ళా జీవిస్తాడు" అని పల్మాడు-11,25, అనగా క్రీస్తుని విశ్వసించేవాళ్ళు మరణానంతరం మళ్ళా లేస్తారు.

ఇక, క్రీస్తు శరీరమైన దివ్యసత్రసాదంకూడ మనకు ఉత్థానాన్ని దయచేస్తుంది. కనుకనే ప్రభువు "నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం జేసేవాడు నిత్యజీవాన్ని పొందుతాడు. నేనతన్ని అంతిమదినాన లేపుతాను" అని పల్మాడు-6,54. ఉత్థాన క్రీస్తు ప్రధానంగా జీవమయుడు, అతని శరీరాన్ని ఆరగించినపుడు మనంకూడ జీవమయులమౌతాం, ఈ జీవమే మనల్ని లోకాంతంలో లేపుతుంది. క్రీస్తు "నేను తండ్రి మూలాన జీవిస్తున్నాను. అట్లే నన్నుభుజించేవాడు నా మూలాన జీవిస్తాడు" అని నుడివాడు6,57. అనగా జీవవాహిని తండ్రి నుండి కుమారుణ్ణి చేరుతుంది. కుమారుని నుండి మనలను చేరుతుంది. మరో సందర్భంలో అతడు “తండ్రి ఏలా మృతులను సజీవులను చేసాడో అలాగే కుమారుడుకూడ తన కిష్టమైనవారిని సజీవులను చేస్తాడు" అని వాకొన్నాడు–5,21.

యూదుల్లో ఓ తెగవాళ్ళయిన సదూకయిలు ఉత్తానాన్ని నమ్మరు. వీళ్ళ క్రీస్తుతో ఉత్థానం లేదని వాదించారు. కాని ప్రభువు వీళ్ళ నోళ్లు మూయించాడు. దేవుడు సజీవుల దేవుడు కాని మృతుల దేవుడు కాడు. కాని మనం జీవంతో లేస్తేనేగాని అతడు సజీవుల దేవుడు కాలేడు. అందుచేత ఉత్థానమనేది ఉంది అని క్రీస్తు రుజువు చేసాడు - మత్త 22,23-32,

3. నూతవేద రచయితలందరిలోను ఉత్థానాన్ని గూర్చి విస్తృతంగా చెప్పినవాడు పౌలు. అతని భావాలను మనం చక్కగా జీర్ణం చేసుకోవాలి