పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/222

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12. బైబులు కొండలు

ఈ క్రింది కొండలపేర్లు తెలియజేయుడు.
1.మోషే మండుచున్న పొదనుచూచిన పర్వతము.
2.అతడు చనిపోయిన కొండ.
3.ఏలీయా ప్రార్ధింపగా అగ్ని దిగివచ్చిన కొండ.
4.ఏలీయా దేవుని కలసికొనిన కొండ.
5.సమరయులు తమ దేవాలయమును నిర్మించుకొనిన కొండ.
6.నోవా వోడ నిల్చిన కొండ.
7.అబ్రాహాము ఈసాకుని బలిగా సమర్పింపబోయిన కొండ.
8.క్రీస్తు దివ్యరూపము తాల్చిన కొండ.
9.క్రీస్తుని సిలువవేసిన కొండ.
10.అతడు మోక్షారోహణము చేసిన కొండ.

13. బైబులు జంతువులు

ఈ క్రింది జంతువులు ఏవో తెలియజేయుడు,
1.ఈ జంతువు పేరు క్రీస్తు బిరుదములలో ఒకటి.
2.ఇది తన కొమ్మల వలన పొదలో చిక్కుకొనెను,
3.దీని కడుపులో ఒక ప్రవక్త మూడునాళ్లుండెను.
4.ఇది తనపైనెక్కి ప్రయాణము చేయువారితో మాటలాడెను.
5.ఇది ఒక బలాఢ్యుని మీదికి దూకగా అతడు దానిని పట్టుకొని గొర్రెపిల్లనువలె చీల్చివేసెను.
6.ఫరో చక్రవర్తి ఈ జంతువులను పదునాల్డింటిని కలలో చూచెను.
7.ఈ జంతువు యిస్రయేలీయుల పాపములను ఎడారిలోనికి మోసికొని పోయెను.
8.రిబ్కా ఈ జంతువుపైనెక్కి ఈసాకు నింటికి వచ్చెను
9.ఈ జంతువు ఒక పేదవాని పుండ్లను నాకెను.
10.క్రీస్తు హెరోదురాజును ఈ జంతువుతో పోల్చెను

.

14. బైబులు కట్టడాలు

ఈ క్రింది కట్టడాలు ఏవో తెలియజేయుడు.
1.కఫర్నాములో రోమను సైన్యాధిపతి యూదుల కొరకు దీనిని కట్టించెను.
2.సొలోమోను మొదటిసారిగా దీనిని కట్టించెను.