పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/213

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ప్రార్థనాభావాలు

1.డమస్కు దర్శనంవల్ల పౌలు పూర్తిగా మారిపోయాడని చెప్పాం. ఈ కాలంనుండి క్రీస్తు అతనికి ఏకైక ధ్యేయమయ్యాడు. ఆ ప్రభువుని బోధించడానికి అతడు సుదీర్ఘమైన ప్రేషిత ప్రయాణాలు మూడు చేసాడు. ఆనాటి గ్రీకు పట్టణాల్లో ఎన్నో క్రైస్తవ సమాజాలను స్థాపించాడు. ఆ సమాజాలకు 14 జాబులు వ్రాసాడు, వాటిని నూత్నవేదంలో నేటికీ చదువుతున్నాం. తీతు తిమోతిలాంటి శిష్యబృందాన్ని తయారుచేసాడు. ప్రభువుపట్ల తనకున్న గాఢమైన భక్తివల్ల ఇప్పడు నేనుకాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడని చెప్పకొన్నాడు-గల 2.20. అతన్ని బోధించకపోతే నా పరిస్థితి దారుణమౌతుందని వాకొన్నాడు - 1కొ 9,16-17. క్రీస్తే మనకు నిజమైన విలువ, అతనితో పోలిస్తే ఈ లోకంలోని వస్తువులన్నీ చెత్తాచెదారంలాగ విలువలేనివి అని వాకొన్నాడు-ఫిలి 3,8-11. ఇలాంటి డమస్కదర్శనాన్ని మనం పవిత్ర గ్రంథంనుండి మళ్ళామళ్ళా చదువుకొని ప్రేరణం పొందాలి.

2.పౌలుకి కలిగిన క్రీస్తు అనుభూతిలో ఓ నూరవవంతయినా మనకుకూడ కలిగితే మన జీవితం ధన్యమౌతుంది. మనం పుట్టు ප්‍රිෆික්‍ෂළුය. క్రీస్తు విశ్వాసం కొరకు మనం ఎలాంటి కృషి చేయలేదు. ఏ శ్రమా పడలేదు. కనుక మామూలుగా మనకు అతనిపట్ల గాఢమైన విశ్వాసం పట్టదు. ఇప్పడు వేదగ్రంథ పఠనంద్వారా, దేవద్రవ్యానుమానాలను భక్తితో స్వీకరించడంద్వారా, ప్రార్థన చేసికోవడం ద్వారా మనం ఈ యనుభూతిని పొందాలి. సౌలుకి లాగ ఇప్పడు మనకు అద్భుతమైన దర్శనాలేమీ కలగవు. మనం విశ్వాసంద్వారా హృదయంలోనే ప్రేరణం పొందాలి. ఆ ప్రేరణాన్ని ప్రభువునుండి మనకు సంపాదించి పెట్టమని ప్రేషితుడైన పౌలునే అడుగకొందాం.

3.క్రీస్తుని బోధించకపోతే నా పరిస్థితి దారుణమౌతుంది అనుకొని పౌలు వేదబోధకు పూనుకొన్నాడు. మనకు వేదబోధపట్ల శ్రద్ధ వుండదు. ఇరుగుపొరుగువాళ్ళకు క్రీస్తుని తెలియజేసే పూచీ క్రైస్తవులందరికీ వుంది. ఈ దేశంలో కేవలం 2.5 శాతం క్రైస్తవులు. కనుక మనకు బోధన తపనను దయచేయమని పౌలుని అడుగుకొందాం. 205