పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువును ధ్యానించుకునేది. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆ ప్రభువును ఆరాధించుకునేది. ఆ ప్రభువు పాపపులోకాన్ని ఉద్ధరించాలని వేడుకుంటూండేది. ఆమె ప్రార్ధనా ఫలితంగా ప్రభువు తన ప్రతినిధియైన మెస్సీయాను సత్వరంగా భూమి మీదకు పంపాడు.

పూర్వవేదం కన్యాత్వాన్ని పెద్దచూపు పూర్వ, నూత్న వేదాల మధ్యకాలంలో జీవించిన కుమ్రాను భక్తులు మాత్రం కన్యాత్వాన్ని ఆదరించారు. ఇక క్రీస్తు వచ్చాక నూత్నవేదంలో కన్నెరికానికి విలువ హెచ్చింది. ఈలా శ్రీసభలో కన్యాత్వాన్ని స్థాపించి కన్యా జీవితానికి గౌరవస్థానం కల్పించిన ప్రభువు, తన తల్లికిగూడ ఈ భాగ్యాన్ని ప్రసాదింపకపోడు గదా!

4. కన్నెరికపు విలువలు

మరియ కన్యగా వుండిపోయి చాల విలువలు నెలకొల్పింది. క్రీస్తుకు పరలోకంలో తల్లిలేదు. భూలోకంలో తండ్రిలేడు. అనగా అక్కడ యిక్కడాను మానుష ప్రయత్నం లేకుండానే జన్మించిన ఏకైక కుమారుడు యేసు ఈలాంటి కుమారునికి తల్లియై జన్మ సార్థకం జేసుకుంది మరియ. బలిపీఠంమీది పాత్రం పవిత్రమైంది. దాన్ని వేరేపానీయాలకు వాడం. క్రీస్తు జననంద్వారా మరియమాత గర్భంకూడ పవిత్రమైంది. ఆ గర్భం దేవునికే అంకితమైంది. ఆ గర్భం నుండి వేరే బిడ్డలు కలుగరు. కలుగకూడదు. ఆమె కన్నెరికం అంత విలువైంది.

కన్యాత్వంద్వారానే మరియ దేవునికి యోగ్యురాలైన తల్లి కాగల్లింది. కన్యాత్వం ద్వారానే ఆమె మనకూ తల్లి ఔతుంది. మన రక్షణకోసం ప్రభుని ప్రార్ధిస్తుంది. మనకు వరప్రసాదాలు ఆర్ధించి పెడుతుంది. మనలను పవిత్రులను చేస్తుంది. ప్రాచీన క్రైస్తవ రచయితలు ఆమె కన్నెరికాన్నివేనోళ్ళ కొనియాడారు. సీనాయివద్ద మోషే చూచిన పొద కాలుతూకూడ నుసికాలేదు. సంసారజీవితం జీవించి బిడ్డనుకన్నా మరియు తన కన్యాత్వాన్ని కోల్పోలేదు. ఆమె తన్ను సృష్టించిన దేవుణ్ణి, భూమ్యాకాశాలు భరించలేని ప్రభువుని, తన ఉదరంలో భరించిన భాగ్యమూర్తి. దానియేలు గ్రంథం వర్ణించే అగ్నిగుండంలోని అగ్నిబాలురను తాకలేదు. అలాగే మరియమాత గర్భంలో ప్రవేశించిన దైవతేజస్సుకూడ ఆమె కన్యత్వాన్ని నాశంచేయలేదు. యెహెజ్కేలు గ్రంథం వర్ణించే తూర్పుద్వారం, ఓమారు ప్రభువు ప్రవేశించాక శాశ్వతంగా మూసివేయబడింది - 44, 12.ఇక నరులెవ్వరూ దానిలో ప్రవేశింపలేరు. అలాగే మరియ గర్భమూ ఓమారు క్రీస్తు జన్మించాక పూర్తిగా మూసివేయబడింది. ఇక ఆమెకు వేరే బిడ్డలంటూ కలుగలేదు.