పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/89

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాజకత్వంలోను పాలుపొందుతాడు. అతినిది రెండవ అంతస్తు మాత్రమే. అతడు ప్రధానంగా బిషప్పకి సహాయుడు. అతని అధికారంక్రింద పనిచేసేవాడు. అతన్ని తన విచారణలో ప్రత్యక్షం చేసేవాడు. క్రీస్తు మూడు లక్షణాలను బిషప్ప పొందితే మళ్లా బిషప్పనుండి ఈ మూడు లక్షణాలను పొందేవాడు గురువు.

పీఠాధిపతి చుటూ యాజకబృందం వుంటుంది. గురువు అభిషేకం ద్వారా ఈ యాజక బృందంలోనికి ప్రవేశిస్తాడు. ఆ విూదట అతనికి ఈ బృందంతో విడివడని సంబంధం వుంటుంది. అందుకే గురువు అభిషేకం పొందేప్పడు బిషప్పతో పాటు తోడి గురువులుకూడ అతనిపై చేతులు చాస్తారు. అనగా పీఠాధిపతితోపాటు వాళ్ళూ అతన్ని అభిషేకిస్తారు. కనుక గురువు ఎప్పడుకూడ యాజకబృందానికి చెందినవాడుగానే పనిచేస్తాడు కాని వ్యక్తిగతంగా పనిచేయడు.

గురువు ప్రధానంగా మేత్రాసనానికి చెందినవాడు. ఈ మేత్రాసనం విశ్వశ్రీసభలో ఒక జీవకణం. దీనికి అధిపతి పీఠాధిపతి. కనుక పీఠాధిపతి ప్రతినిధిగానే గురువు క్రీస్తు యాజకత్వంలో పాలుపొందుతాడు. కావున బిషప్పకి విధేయుడై యుండడం గురువు ఆధ్యాత్మిక జీవితంలో ప్రధానాంశం. రెండవ శతాబ్దానికి చెందిన అంటియోకయ ఇన్యాసివారు ఇలావ్రాసారు. "వీణతో తంత్రులు ఐక్యమైయున్నట్లేగురువులు తమ బిషప్పతో ఐక్యమై యుండాలి. క్రీస్తు శరీరం ఒక్కటే. మనం పానంచేసే అతని దివ్యరక్తం ఒక్కటే. బలిపీఠం ఒక్కటే. తన గురుబృందతో ఐక్యమైయుండే బిషప్పకూడ ఒక్కడే"

గురువు సేవలు ప్రధానంగా స్థానిక తిరుసభలోని విచారణకు చెందుతాయి. అతడు తన విచారణలోని ప్రజలకు మధ్యవర్తిగా వుంటాడు. వారి తరపున, వారితో కలసి పూజబలి నర్పిస్తాడు.

4. యాజకత్వాన్ని గూర్చిన ప్రోటస్టెంటు నాయకుల భావాలు

ప్రోటస్టెంటు నాయకులు నరుల యాజకత్వాన్ని అంగీకరించరు. క్రీస్తు యాజకత్వం ఒక్కటే చాలని వీళ్ళవాదం, వీళ్ళ భావాల ప్రకారం, మనలను రక్షించేది విశ్వాసం కాని గురువు అర్పించే పూజబలి కాదు. బోధకుడు బోధచేసినపుడు మనం దైవవాక్యాన్ని విశ్వసిస్తే చాలు, అదే మనకు రక్షణం ఇస్తుంది. ఇక నరుని యాజకత్వంతో అవసరంలేదు. తిరుసభలో అధికారులు వుండవచ్చు. కాని గురువుల అధికారం అక్కర్లేదు. క్రైస్తవ సమాజాల్లో ఎవరైనా గురువులుగా వ్యవహరిస్తున్నారంటే వాళ్లకా పదవినిచ్చింది క్రైస్తవ సమాజమే కాని క్రీస్తకాదు. కనుక ఇవ్వాళ్ళ గురువుగావున్న వ్యక్తి రేపు కేవలం గృహస్టుడు కావచ్చు