పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దల హోదా పెరగలేదు. వాళ్ళ ఒక బృందంగా కూడి ఒక్క బిషప్ప అధికారం (පීoඨ పనిచేసారు. సంయుక్త పూజలో బిషప్పే ప్రధాన గురువు. పెద్దలు అతనితో కలసి పూజచేసారు. కాని ఈ పెద్దలు, రెండవ శతాబ్దంలోనే, బిషప్ప అనుమతితో, విచారణలోని మారుమూల గ్రామాల్లో కూడ వ్యక్తిగతంగా పూజ చేసేవాళ్లు.

కనుక రెండవ శతాబ్దం నుండి క్రీస్తు యాజకత్వం రెండు ప్రధాన శాఖలుగా చీలింది. ఒకవైపు పర్యవేక్షకులు లేక బిషప్పల బృందం వుండేది. వీళ్ళు పేత్రు స్థానంలో వుండేవాళ్ళు. మరొకవైపు పెద్దల బృందం వుండేది. బిషప్పులూ పెద్దలూకూడ బృందాలుగానే వ్యవహరించేవాళ్ళ వీళ్ళందరినీ ఐక్యపరచేవాడు క్రీస్తే. అందరూ అతని యాజకత్వంలోనే పాలుపొందారు. రోము బిషప్పు అందరికీ పెద్ద అయ్యాడు. అతడు క్రీస్తూనీ, పేత్రునీ ప్రత్యేకంగా సూచిస్తుండేవాడు. ఈరీతిగా ఇప్పటి పోపుగారు, బిషప్పలు, గురువులు అనే విభజనం రెండవ శతాబ్దం నాటికే వుంది.

2.క్రీస్తే స్వయంగా యాజకత్వాన్ని స్థాపించాడు

ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. క్రీస్తే యాజకత్వ సంస్కారాన్ని స్థాపించాడు.

కొందరు ప్రోటస్టెంటుల భావించినట్లుగా గురుపట్టాన్ని తిరుసభ స్థాపించలేదు. క్రీస్తే దాన్ని స్థాపించాడు. పూర్వ వేదకాలంలోనే మలాకీ ప్రవక్త "తూర్పునుండి పడమర వరకు ప్రపంచంలోని ప్రజలందరూ నన్ను గౌరవిస్తారు. వాళ్ళు నాకు సాంబ్రణిపొగవేసి పవిత్రమైన బలి నర్పిస్తారు" అని వాకొన్నాడు–1,11. ఈ ప్రవక్త సూచించింది నూత్నవేదప క్రీస్తుబలినీ, క్రైస్తవ యాజకులనీ. ఇక, నూత్నవేదంలో క్రీస్తు స్వయంగా యాజకుడై తన్ను తానే బలిగా అర్పించుకొన్నాడు. అతడు కడపటి విందులో రొట్టెరసాలను తన శరీరరక్తాలుగా అర్పించి, శిష్యులుగూడ ఆ కార్యాన్ని కొనసాగించాలని ఆదేశించాడు. “మీరు దీనిని నా జ్ఞాపకార్థంగా చేయండి" అన్నాడు -1కొ 11,23–26; లూకా 22,19. అనగా అతని కల్వరిబలిని కొనసాగించేవాళ్ళూ దాన్ని ప్రజలమధ్య ప్రత్యక్షం చేసేవాళ్ళూ శిష్యులూ వారి అనుయాయులూను. “మీరు దీనిని నా జ్ఞాపకార్థం చేయండి" అనే వాక్యం ద్వారానే క్రీస్తు గురుపట్టాన్ని స్థాపించాడు. మళ్ళా అతడు ఉత్తానానంతరం శిష్యులకు జ్ఞానస్నానాది సంస్కారాలను దయచేసే హక్కు నిచ్చాడు - మత్త 28,19-20. వారికి పవిత్రాత్మను దయచేసి ప్రజల పాపాలను మన్నించే హక్కునిచ్చాడు - యోహా 20,22-23. క్రీస్తు గురుపట్టాన్ని ఎప్పడు స్థాపించాడు అనే ప్రశ్నకు, పై కడపటి భోజన వాక్యాలను ఉత్థానానంతర వాక్యాలనూ కలిపి తీసికోవాలి.