పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/83

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1) పెద్దలు. ఆ కాలపు లౌకిక సమాజంలో నగరాధ్యక్షులను "పెద్దలు" అనేవాళ్లు. ఈ పేరునే క్రైస్తవ సమాజంలోని పెద్దలకుగూడ పెట్టారు. (గ్రీకు, ప్రెస్బితెరోయి). పౌలు అతని స్నేహితుడు బర్నబా చాల సమాజాలకు పెద్దలను నియమించారు - అచ 14,23. ఈ పెద్దలు ధర్మంగా వచ్చిన డబ్బును ఆయా అవసరాలకు వినియోగించేవాళ్లు - అచ 11,30. ఇంకా, వేదబోధ చేస్తుండేవాళ్లు, ఆరాధనలో ప్రధానపాత్రను నిర్వహించేవాళ్లు-1తిమో 5.17. ఈ పెద్దలే రెండవ శతాబ్దంలో నేటి మన గురువులుగా మారారు. ఈ విషయం తర్వాత స్పష్టమౌతుంది.

2) పర్యవేక్షకులు లేక అధ్యక్షులు. అపోస్తలుల నాటి క్రైస్తవ సమాజంలో పెద్దలతోపాటు అధ్యక్షులు లేక పర్యవేక్షకులు అనే అధికారులుకూడ వుండేవాళ్లు (గ్రీకు, ఎపిస్కోపోయి). వీళ్లకు ఆనాటి క్రైస్తవ సమాజంలో మంచి గుర్తింపు వుండేది -1తిమో 3,2. ఆ కాలపు నగరాల్లో అత్యున్నతాధికారులను "పర్యవేక్షకులు" అని పిల్చేవాళ్ళ ఈ క్రైస్తవ సమాజాల్లో అధ్యక్షులకుగూడా పెట్టారు. అపోస్తలులు మొదలైన క్రైస్తవాధికారులు వీరిమీద చేతులు చాచగా వీళ్లు పర్యవేక్షకులు అయ్యేవాళ్ళ-2తి 1,6. వాళ్లు నాటి క్రైస్తవ సమాజాలకు ప్రధాన బాధ్యతను వహించేవాళు-అ,చ, 20,28.

తొలిరోజుల్లో కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తిని పెద్దఅనీ పర్యవేక్షకుడనీ గూడ పిల్చేవాళ్ళు. కనుక ఈ పేర్లు కొన్నిమార్లు తారుమారవుతుండేవి-అచ 20,17.28. ఈ పర్యవేక్షకులే రెండవ శతాబ్దంలో నేటి మన బిషప్పులుగా మారిపోయారు. ఈ యంశం మిూదట స్పష్టమౌతుంది.

3) పరిచారకులు. పై రెండు వర్గాల వారితోపాటు పరిచారకులు అనబడేవాళ్ళకూడ వుండేవాళ్ళు (గ్రీకు, దియాకొనోయి). అపోస్తలులు తమకు సాయం చేయడానికి ఈ డీకన్లను నియమించారు-అ,చ,6,1-6. వీళ్ళ అన్నం వడ్డించడం మొదలైన భౌతిక కార్యాల్లోను, సువిశేష బోధ మొదలైన ఆధ్యాత్మిక కార్యాల్లోను సాయం చేస్తుండేవాళ్ళు.


2. త్రిముఖమైన పవిత్రాధికారం

పైన మనం పేర్కొన్న పెద్దలు పర్యవేక్షకులు పరిచారకులు అనే వాళ్లకు అపోస్తలులతోపాటు త్రివిధాధికారాలు వుండేవి. అవి వేదబోధ చేయడం. ప్రజలను పరిపాలించడం, ప్రజలను పవిత్రపరచడం. ఫిలిప్పు అనే పరిచారకుడు ఇతియోపీయునికి వేదబోధ చేసాడు– అచ 8,35. తిమోతి ఇతరులమిద చేతులు చాచి వాళ్ళను పెద్దలను చేసాడు-1తిమోతి 5,22.