పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/234

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒకరి సలహా వొకరు విన్నారు. చివరకు మాయోపాయంతో యేసుని బంధించి చంపివేయాలని నిశ్చయించుకొన్నారు. - మత్త 26, 3-4

6. పరిశుద్ధాత్మ దిగివచ్చాక శిష్యులు యేసే మెస్సియాయని యెరూషలేములో బోధిస్తున్నారు. అతని పేరుమీదిగా అద్భుతాలు చేస్తున్నారు. యూదుల ప్రధాన యాజకుడు వాళ్ళని దడిపించాడు. చెరలో వేయించాడు. యేసు పేరుమీదిగా బోధించవద్దన్నాడు. అయినా శిష్యులు మానలేదు. యూదుల నాయకులు అపోస్తలులను బంధించి వాళ్ల మహాసభ యెదుటికి కొనివచ్చారు. ఆ సభలోని సభ్యులు అపోస్తలులను చంపివేయాలని సలహా యిచ్చారు. అప్పడు గమలియేలు అనే వృద్దుడులేచి "వీళ్ల ఉద్యమం మానవ ప్రయత్నమైతే దానంతట అదే అణగిపోతుంది. దైవ ప్రయత్నమైతే మీరు దాన్ని అణచివేయలేరు. పైగా మీరు దేవునితోనే పోట్లాడినట్ళాతుంది. కనుక యిప్పడు వీళ్లను ఏమి చేయకుండా వదలివేయండి" అని ఆ సభలోని సభ్యులకు ఆలోచన చెప్పాడు. మహాసభ సభ్యులు అతని సలహాను పాటించి అపోస్తలులను వదలివేసారు. - అచ 5, 38,39.

7. సలహ లేకపోతే ప్రజ నాశమైపోతుంది. చాలమంది సలహదారులుంటే భద్రత కలుగుతుంది. - సామె 11,14.

21. కృతజ్ఞత

మనం తోడినరులకు ఏదైనా ఉపకారం చేసినపుడు వాళ్లు మనకు కృతజ్ఞులై వండాలని అనుకొంటాం. భగవంతుడు గూడ నరుడు తనకు కృతజ్ఞడై ఉండాలనే కోరుకొంటాడు. కృతజ్ఞతాపరుల చరిత్రలు వింటానికి చాల రమ్యంగా ఉంటాయి.

1. సౌలు కుమారుడైన యోనాతానూ దావీదూ మిత్రులు. సౌలుకు దావీదుమీద అసూయ పుట్టగా అతన్ని చంపివేయాలని తలపోస్తున్నాడు. యోనాతాను ఆ సంగతి దావీదుకు తెలియజేసి అతన్ని భద్రంగావుండమని హెచ్చరించాడు. పైగా అతడు దావీదు నమ్మదగిన బంటుగాని ద్రోహిగాడు అని తండ్రికి నచ్చజెప్పాడు. సౌలు ఆ మాటలకు సంతృప్తి చెంది దావీదును మళ్ళా కొలువులో చేర్చుకొన్నాడు. ఈ యుపకారానికి దావీదు యోనాతానుకు కృతజ్ఞతలు తెలిపాడు -1 సమూ 19, 1-7.

2. యోసేపుతోపాటు ఫరోరాజు వంటలవాడూ పానీయ వాహకుడూ కూడ చెరలో వున్నారు. వాళ్ళిద్దరికీ కలలు వచ్చాయి. పానీయవాహకుడు బ్రతికి బయటపడతాడనీ వంటలవానికి మరణశిక్ష ప్రాప్తిస్తుందనీ యోసేపు కలలకు వివరం చెప్పాడు. అతడు చెప్పినట్లే జరిగింది. కాని పానీయవాహకుడు చెరనుండి బయట బడినంక యింకా చెరలోనే